IND vs AUS : య‌శ‌స్వి జైస్వాల్ చెత్త రికార్డ్‌.. టెస్టుల్లో తొలి భార‌త బ్యాట‌ర్‌గా..

ఈ ఏడాది టెస్టుల్లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్ ఓ చెత్త రికార్డును న‌మోదు చేశాడు.

IND vs AUS : య‌శ‌స్వి జైస్వాల్ చెత్త రికార్డ్‌.. టెస్టుల్లో తొలి భార‌త బ్యాట‌ర్‌గా..

Yashasvi Jaiswal Enters Embarrassing List After Golden Duck In Adelaide Test

Updated On : December 6, 2024 / 4:03 PM IST

ఈ ఏడాది టెస్టుల్లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్ ఓ చెత్త రికార్డును న‌మోదు చేశాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై మొద‌టి బంతికే ఔటైన తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ దీన్ని అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో భార‌త్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ గా య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌లు బ‌రిలోకి దిగారు. ఇన్నింగ్స్ ను జైస్వాల్ ఆరంభించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ క్ర‌మంలో ఆసీస్ గ‌డ్డ పై మొద‌టి బంతికే ఔటైన తొలి భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఇక ఓవ‌రాల్‌గా నాలుగో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. జైస్వాల్ కంటే ముందు ఆర్చీ మాక్‌లారెన్ (ఇంగ్లాండ్), స్టాన్ వర్తింగ్టన్ (ఇంగ్లాండ్‌), రోరీ బర్న్స్ (ఇంగ్లాండ్‌) ఈ చెత్త రికార్డును క‌లిగిఉన్నారు.

ACC U19 Asia Cup 2024 : దంచికొట్టిన‌ 13 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ.. అండ‌ర్‌-19 ఆసియా క‌ప్‌ ఫైన‌ల్‌కు భార‌త్‌..

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై తొలి బంతికే ఔటైన బ్యాట‌ర్లు వీరే..
* ఆర్చీ మెక్‌లారేన్(ఇంగ్లాండ్) – 1894లో
* స్టాన్ వర్తింగ్టన్(ఇంగ్లాండ్) – 1936లో
* రోరీ బర్న్స్(ఇంగ్లాండ్) – 2021లో
* యశస్వి జైస్వాల్(భారత్)- 2024లో

ఇక టెస్టు మ్యాచుల్లో తొలి బంతికే ఏడో భార‌త బ్యాట‌ర్‌గా య‌శ‌స్వి జైస్వాల్ రికార్డుల‌కు ఎక్కాడు.

IND vs AUS : రోహిత్.. ఇది నీకు అవ‌స‌ర‌మా చెప్పు.. త్యాగం చేశావ్‌.. ఇప్పుడు చూడు ఏమైందో..

టెస్టుల్లో గోల్డెన్ డకౌటైన భారత ఆటగాళ్లు..
* సునీల్‌ గవాస్కర్ – 1974లో ఇంగ్లాండ్ పై
* సుదీర్ నాయక్ – 1974లో ఇంగ్లాండ్ పై
* సునీల్‌ గవాస్కర్ – 1983లో వెస్టిండీస్ పై
* సునీల్‌గవాస్కర్ – 1987లో పాకిస్తాన్ పై
* డ‌బ్ల్యూవీ రామన్ -1990లో న్యూజిలాండ్ పై
* శివ సుంద‌ర్ దాస్ – 2002లో వెస్టిండీస్ పై
* వసీం జాఫర్ – 2007లో బంగ్లాదేశ్ పై
* కేఎల్‌ రాహుల్ – 2017లో శ్రీలంక పై
* య‌శ‌స్వి జైస్వాల్ – 2024లో ఆస్ట్రేలియాపై

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవ‌ర్ల‌లో 180 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో నితీశ్ రెడ్డి (42), కేఎల్ రాహుల్ (37), శుభ్‌మ‌న్ గిల్ (31)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీశాడు. పాట్ క‌మిన్స్, స్కాట్ బొలాండ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.