IND vs AUS : సహనం కోల్పోయిన సిరాజ్.. లబుషేన్ పైకి బంతిని విసేరేశాడు.. వీడియో
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు

IND vs AUS Siraj attacks Labuschagne with ball as batter pulls out at the last moment
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్‌బాల్ టెస్టు మొదటి రోజు ఆటలో సిరాజ్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. మార్నస్ లబుషేన్ పైకి బంతిని విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని వేసేందుకు సిరాజ్ సిద్ధం అయ్యాడు. రన్నప్ తీసుకున్నాడు. పరిగెత్తుకుంటూ రాగా.. ఒక్కసారిగా క్రీజు నుంచి లబుషేన్ పక్కకు జరిగాడు. దీనిపై సిరాజ్ అసహనం వ్యక్తం చేశాడు. అదే రన్నప్‌తో వచ్చిన సిరాజ్ కోపంగా బంతిని నేరుగా వికెట్ల పైకి విసిరికొట్టాడు.
IND vs AUS : పింక్‌బాల్ టెస్టులో పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా.. తొలి రోజు ముగిసిన ఆట..
కాగా.. సైడ్ స్క్రీన్ వద్ద ఓ ప్రేక్షకుడు పెద్ద మొత్తంలో కప్పులతో నడుస్తూ ఉండడంతోనే లబుషేన్ పక్కకు తప్పుకున్నాడు. ఈ విషయం తెలియని సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమాయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మార్నస్ లబుషన్ (20), నాథన్ మెక్‌స్వీనీ (38) లు క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకబడి ఉంది.
IND vs AUS : యశస్వి జైస్వాల్ చెత్త రికార్డ్.. టెస్టుల్లో తొలి భారత బ్యాటర్‌గా..
Mohammed Siraj was not too pleased with this 😂#AUSvIND pic.twitter.com/1QQEI5NE2g
— cricket.com.au (@cricketcomau) December 6, 2024