SA vs SL : ఏమ‌ప్పా ఇదీ.. ర‌బాడ బ్యాట్‌ను విర‌గొట్టిన శ్రీలంక క్రికెట‌ర్‌..

శ్రీలంక బౌల‌ర్ విసిరిన బంతి వేగానికి ద‌క్షిణాష్రికా ప్లేయ‌ర్ ర‌బాడ బ్యాట్ విరిగింది.

SA vs SL : ఏమ‌ప్పా ఇదీ.. ర‌బాడ బ్యాట్‌ను విర‌గొట్టిన శ్రీలంక క్రికెట‌ర్‌..

Lahiru Kumara breaks Rabada bat with fierce delivery in second Test

Updated On : December 7, 2024 / 11:11 AM IST

సెయింట్ జార్జ్ ఓవ‌ల్‌లో ద‌క్షిణాఫ్రికా, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఓ స‌ర‌దా ఘ‌ట‌న చోటు చేసుకుంది. శ్రీలంక బౌల‌ర్ విసిరిన బంతి వేగానికి ద‌క్షిణాష్రికా ప్లేయ‌ర్ ర‌బాడ బ్యాట్ విరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ద‌క్షిణాప్రికా ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఇది చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 90వ ఓవ‌ర్‌ను శ్రీలంక పేస‌ర్ లహిరు కుమార వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని గంట‌కు 137 కిమీ వేగంతో వేశాడు. హ‌ర్ట్ లెంగ్త్‌లో ప‌డిన బంతి బౌన్స్ అయింది. ర‌బాబ ఫార్వ‌ర్డ్ డిఫెన్స్ ఆడాడు. అయితే.. బాల్ బ్యాట్ హ్యాండిల్‌కు స‌మీపంలో త‌గ‌డంతో హ్యాండిల్ విరిగిపోయింది. ఆ వెంట‌నే ర‌బాడ కొత్త బ్యాట్‌ను తెప్పించుకుని ఆడాడు. కాసేటికే అత‌డు ఔటైయ్యాడు. ఈ మ్యాచ్‌లో ర‌బాడ 40 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల సాయంతో 23 ప‌రుగులు చేశాడు.

IND vs AUS : అరుదైన ఘ‌న‌త సాధించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ఈ ఏడాది టెస్టుల్లో ఒకే ఒక్క‌డు..

కాగా.. ర‌బాడ బ్యాట్ విరిగిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో 358 ప‌రుగులు చేసింది. స‌పారీ బ్యాట‌ర్ల‌లో రికెల్టన్ (101; 250 బంతుల్లో 11 ఫోర్లు), వెర్రెయిన్ (105 నాటౌట్; 133 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు. లంక బౌల‌ర్ల‌లో లహిరు కుమార నాలుగు వికెట్లు తీశాడు. అసిత ఫెర్నాండో మూడు, విశ్వ ఫెర్నాండో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్ల న‌ష్టానికి 242 ప‌రుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (40), మెండిస్ (30) క్రీజులో ఉన్నారు. స‌ఫారీ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 116 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది.

IND vs AUS : స‌హ‌నం కోల్పోయిన సిరాజ్‌.. ల‌బుషేన్ పైకి బంతిని విసేరేశాడు.. వీడియో