Rishabh Pant : రిష‌బ్ పంత్‌కు అత్యాశ‌.. అందుక‌నే మెగావేలంలోకి.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొత్త కోచ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు రిష‌బ్ పంత్ పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ నూత‌న హెడ్ కోచ్ హేమంగ్ బ‌దానీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

Rishabh Pant : రిష‌బ్ పంత్‌కు అత్యాశ‌.. అందుక‌నే మెగావేలంలోకి.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొత్త కోచ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

Delhi Capitals head coach makes shocking allegations on Rishabh Pant

Updated On : December 7, 2024 / 4:37 PM IST

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు రిష‌బ్ పంత్ పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ నూత‌న హెడ్ కోచ్ హేమంగ్ బ‌దానీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. పంత్‌కు అత్యాశ ఉంద‌న్నాడు. ఎక్కువ డ‌బ్బు కోస‌మే అత‌డు ఢిల్లీని విడాడ‌ని చెప్పుకొచ్చాడు. సుబ్ర‌మ‌ణ్యం బ‌ద్రీనాథ్‌తో చ‌ర్చ సంద‌ర్భంగా డ‌బ్బుల కోసం ఢిల్లీని వీడ‌డం లేదు అని పంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ బ‌దానీ ఈ కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పంత్‌ను క్యాపిటల్స్ విడుదల చేసింది. ఈ నిర్ణ‌యం అభిమానుల‌తో పాటు క్రికెట్ విశ్లేష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 2016 నుంచి ఢిల్లీతో ఉన్నాడు. 2022, 2024లో సీజ‌న్ల‌లో జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. ఢిల్లీని పంత్ వీడాల‌ని అనుకోవ‌డంతోనే వేలానికి అత‌డిని విడిచిపెట్టామ‌ని ఆ జ‌ట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. అదే స‌మ‌యంలో తాను ఢిల్లీని వీడ‌డానికి డ‌బ్బు కార‌ణం కాద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంత్ చెప్పాడు.

IND vs AUS : భార‌త్‌తో రెండో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 337 ఆలౌట్.. 157 ర‌న్స్ లీడ్‌

తాజాగా.. పంత్ చేసిన ఈ వ్యాఖ్య‌లను హేమంగ్ బదానీ తోసిపుచ్చాడు. అత‌డిని మొద‌టి రిటైన్ ప్లేయ‌ర్‌గా ఉంచుకోవాల‌ని కోరుకున్నాం. అయితే.. అత‌డు ఎక్కువ డ‌బ్బు కావాల‌ని అనుకున్నాడు. మార్కెట్‌లో త‌న వాల్యూను తెలుసుకోవాల‌ని అనుకున్నాడు. అందుక‌నే వేలంలోకి వెళ్లాడు అని బ‌దానీ అన్నాడు.

ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకోవాలంటే రెండు పార్టీలు (ఆట‌గాడు, ఫ్రాంచైజీ) అంగీక‌రించాల‌న్నాడు. అత‌డిని నిలుపుకోవాల‌ని ఢిల్లీ చాలా ప్ర‌య‌త్నించిందన్నాడు. అత‌డికి చాలా సార్లు ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు చేసింద‌న్నాడు. తొలి రిటైన్ ప్లేయ‌ర్‌గా అత‌డికి రూ.18 కోట్లు వ‌స్తాయ‌ని, అయితే అంత‌కంటే వేలంలో ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని భావించి అత‌డు వేలంలోకి వెళ్లాడ‌ని చెప్పాడు. వేలంలో అత‌డు రూ.27 కోట్ల‌కు అమ్ముడుపోయాడ‌ని అన్నారు. ప్ర‌స్తుతం బ‌దానీ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

NZ vs ENG : ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌.. క‌ట్ చేస్తే.. న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ సాధించిన ఇంగ్లీష్ పేస‌ర్‌

మెగావేలంలో రిష‌బ్ పంత్ ను ద‌క్కించుకునేందుకు ఢిల్లీ ప్ర‌య‌త్నించింది. రూ.21 కోట్ల వ‌ద్ద రైటు టు మ్యాచ్ కోసం ప్ర‌య‌త్నించింది. అయితే.. ల‌క్నో రూ.27 కోట్ల‌కు బిడ్ వేసింది.  ఢిల్లీ అంత‌కంటే ఎక్కువగా వేయ‌య‌క‌పోవ‌డంతో పంత్‌ను ల‌క్నో సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆట‌గాడిగా పంత్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ వేలంలోనే శ్రేయ‌స్ అయ్య‌ర్ రూ.26.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.