ద్యుతీచంద్ కష్టాలు.. ట్రైనింగ్‌కు డబ్బుల్లేక కార్ అమ్మేసింది

ఇండియా ఫాస్టెస్ట్ ఉమెన్ ద్యుతీచంద్ ఆర్థిక కష్టాలు వచ్చి పడ్డాయి. ట్రైనింగ్ కొనసాగించడానికి కూడా సమస్యలు వచ్చి పడటంతో లగ్జరీ కారు సెడాన్ ను అమ్మకానికి పెట్టింది. వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తుంది. ఈ 24ఏళ్ల భువనేశ్వర్ అథ్లెట్ ప్రస్తుతం చక్కటి ఫామ్ లో దూసుకెళ్తోంది.
11.22సెకన్ల నేషనల్ రికార్డ్ గెలుచుకున్న ఈమె గతేడాది రాంచీ వేదికగా జరిగిన 59వ నేషనల్ ఓపెన్ మీట్ లో సాధించింది. మహమ్మారితో ఆమె ప్రోగ్రెస్ కు బ్రేక్ పడింది. ఏప్రిల్ లో జరగాల్సిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్ క్యాన్సిల్ అయింది. ద్యుతీ భువనేశ్వర్ లోని తన ఇంట్లోనే ఉంటుంది. ఒడిశా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో కళింగ స్టేడియంలోనే ఆమె విధులు నిర్వర్తిస్తుంది.
ఈ సంవత్సరం మే నెలలో గైడ్ లైన్స్ సడలించడంతో ప్రస్తుతం కోచ్ ఎన్ రమేశ్ ఆధ్వర్యంలో ఆన్ లైన్లోనే ట్రైనింగ్ అవుతుంది. ధ్యుతీ మాట్లాడుతూ.. ‘ఒలింపిక్ ట్రైనింగ్ కోసం లాక్ డౌన్ సమయంలో నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశా. ప్రస్తుతం ఒలింపిక్స్ వాయిదా పడినట్లు తెలిసింది. నా ట్రైనింగ్ ముందుకు సాగాలంటే నాకు రూ.25లక్షలు కావాలి. అందుకే నా కార్ అమ్మేయాలని ఫిక్స్ అయ్యా.
ద్యుతీ తన కోసమే చూసుకోకుండా లాక్‌డౌన్‌లో శరణార్థులకు సాయం చేసింది. స్పాన్సర్లు లేకపోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడుతుంది. ‘కరోనా కారణంగా ట్రైనింగ్ కోసం స్పాన్సర్లు ఎవరూ లేకుండాపోయారు. నా డైట్ కోసం డబ్బులు కావాలి. నా ఒలింపిక్ కల సాకారం కావాలంటే విదేశాలకు కూడా వెళ్లాలి’ అని 2016 రియో ఒలింపిక్స్ పార్టిసిపెంట్ అంటున్నారు.