Rohit Sharma : రోహిత్ శర్మకు ప్రత్యేక జ్ఞాపిక.. సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా అందుకున్న హిట్‌మ్యాన్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌ను విజేతగా నిలిపినందుకు గానూ 27వ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డు ప్రధానోత్సవంలో ఓ ప్రత్యేక అవార్డును రోహిత్ (Rohit Sharma)అందుకున్నారు.

CEAT Cricket Rating Awards Rohit Sharma Receives Special memento
Rohit Sharma : ముంబైలో మంగళవారం సాయంత్రం 27వ సియట్ క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ వేడుకలో సత్కరించారు. ఈ వేడుకకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) హాజరు అయ్యాడు. అతడు ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలుచుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024తో పాటు దుబాయ్ వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ రోహిత్ కెప్టెన్సీలోనే అందుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు టోర్నీల్లోనూ భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌ను విజేతగా నిలిపినందుకు గానూ 27వ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డు ప్రధానోత్సవంలో ఓ ప్రత్యేక అవార్డును రోహిత్‌కు అందుకున్నారు. ఈ అవార్డును దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా రోహిత్ శర్మ అందుకున్నాడు.
కాగా.. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన తరువాత ఓ పబ్లిక్ ఈవెంట్‌లో రోహిత్ శర్మ కనిపించడం ఇదే తొలిసారి.
ROHIT SHARMA – THE LEADER 🐐
Ro received the Special award from CEAT for winning the Champions Trophy. pic.twitter.com/ad5GbSdAZG
— Johns. (@CricCrazyJohns) October 7, 2025
అవార్డులు అందుకుంది వీరే..
* ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి గుర్తుగా ప్రత్యేక అవార్డు – రోహిత్ శర్మ
* లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – బ్రియాన్ లారా
* అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – జో రూట్
* టీ20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ – సంజూ శాంసన్
* టీ20 బౌలర్ ఆఫ్ ది ఇయర్ – వరుణ్ చక్రవర్తి
* సియట్ జియోస్టార్ అవార్డు – శ్రేయస్ అయ్యర్
* వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ – కేన్ విలియమ్సన్
* వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ – మ్యాట్ హెన్రీ
* సియట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – బిఎస్ చంద్రశేఖర్
* మహిళల బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ – స్మృతి మంధాన
* మహిళల బౌలర్ ఆఫ్ ది ఇయర్ – దీప్తి శర్మ
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – అంగ్రిష్ రఘువంశీ
* టెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ – ప్రభాత్ జయసూర్య
* టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – హ్యారీ బ్రూక్
* డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హర్ష్ దూబే