Central Zone clinch first Duleep Trophy title in 11 years
Duleep Trophy 2025 : దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో రజత్ పాటిదార్ నాయకత్వంలోని సెంట్రల్ జోన్ గెలుపొందింది. ఈ విజయంతో సెంట్రల్ జోన్ 11 ఏళ్ల తరువాత దులీప్ ట్రోఫీ(Duleep Trophy 2025)ని ముద్దాడింది. ఇక ఈ ఏడాది రజత్ పాటిదార్ తన నాయకత్వంలో రెండో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అంతకముందు ఐపీఎల్ 18వ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. సౌత్ జోన్ ఆటగాళ్లలో తన్మయ్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సారాన్ష్ జైన్ ఐదు వికెట్లు తీయగా, కుమార్ కార్తికేయ నాలుగు వికెట్లు సాధించాడు.
IND vs PAK : పాక్‌పై భారత్ ఘన విజయం.. గంభీర్ ఏమన్నాడో తెలుసా?
A DREAM YEAR FOR RAJAT PATIDAR AS CAPTAIN. 🫡 pic.twitter.com/3fu7Bw2pyd
— Johns. (@CricCrazyJohns) September 15, 2025
అనంతరం సెంట్రల్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో యశ్ రాథోడ్ (194) భారీ శతకం బాదాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (101) సెంచరీ చేశాడు. సౌత్ జోన్ బౌలర్లలో అంకిత్ శర్మ, గుర్జప్‌నీత్ సింగ్ చెరో నాలుగు వికెట్లు తీశారు.
Shoaib Akhtar : టీమ్ఇండియా ‘నో హ్యాండ్‌షేక్’ పై అక్తర్ కీలక వ్యాఖ్యలు.. అభినందనలు చెబుతూనే..
362 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ జోన్ 426 పరుగులు చేసింది. ఆండ్రూ సిద్ధార్థ్ (84), స్మరన్ రవిచంద్రన్ (67)లు హాఫ్ సెంచరీలు చేశారు. సెంట్రల్ జోన్ ముందు 65 పరుగుల లక్ష్యం నిలవగా నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది.