IPL 2022: సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇక ఇంటికే..
కెప్టెన్ గా వైఫల్యం ఎదుర్కొని సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటికి పయనం కావడం లేదు. పక్కటెముకలకు గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు సీఈఓ కాశీ విశ్వనాథన్ బుధవారం ప్రకటించారు.

Ms Dhoni Steps Down As Csk Captain Ahead Of Start Of Ipl 2022, Ravindra Jadeja To Lead (1)
IPL 2022: కెప్టెన్ గా వైఫల్యం ఎదుర్కొని సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటికి పయనం కావడం లేదు. పక్కటెముకలకు గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు సీఈఓ కాశీ విశ్వనాథన్ బుధవారం ప్రకటించారు. ప్రస్తుత సీజన్ లో జడేజాను ఫామ్ లేమి చాలా బాధించింది. 10 మ్యాచ్ లు ఆడి 116పరుగులు చేసిన జడేజా కేవలం 5వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జడేజా గాయం గురించి ఒక ప్రకటన విడుదల చేశారు. “రవీంద్ర జడేజా పక్కటెముకకు గాయమైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ గేమ్‌కు అందుబాటులో లేడు. అబ్జర్వేషన్లో ఉండగా.. వైద్య సలహా ఆధారంగా మిగిలిన IPL సీజన్ మొత్తం జడేజా దూరంగా ఉండనున్నాడు” అని అందులో పేర్కొన్నారు.
“జడేజా పక్కటెముకకు గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఒత్తిడి లేకుండా చూడాలి. కాబట్టి ఐపిఎల్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాం” అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
Read Also: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా
టోర్నమెంట్ ప్రారంభానికి రెండు రోజుల ముందు MS ధోని కెప్టెన్‌గా తప్పుకుంటూ.. రవీంద్ర జడేజాను CSK కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. కొన్ని మ్యాచ్ ల వైఫల్యం తర్వాత జడేజా కెప్టెన్సీని తిరిగి MS ధోనికి అప్పగించాడు. అప్పటి నుంచి ధోనీ పక్కా ప్లానింగ్ తో జట్టును ప్లేఆఫ్‌ల వేటలో ఉంచాడు.