దేశం గర్వపడేలా చేసింది…పీవీ సింధుకి ప్రశంసల వెల్లువ

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 01:46 PM IST
దేశం గర్వపడేలా చేసింది…పీవీ సింధుకి ప్రశంసల వెల్లువ

Updated On : August 25, 2019 / 1:46 PM IST

BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు. సింధుకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పీవీ సింధుకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందలు తెలిపారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అన్నారు. బ్యాడ్మింటన్ కోర్టులో సింధు మ్యాజిక్, హార్డ్ వర్క్, పట్టుదల మిలియన్ల మందిని ఆకర్షిస్తాయని,ఇన్స్ పైర్ చేస్తాయని కోవింద్ అన్నారు. ప్రపంచ ఛాంపియన్ సింధు అన్ని భవిష్యత్ యుద్ధాలకు శుభాకాంక్షలు అంటూ కోవింద్ ట్వీట్ చేశారు.

తెలుగు తేజం పీవీ సింధు విజయం పట్ల ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన ప్రతిభావంతురాలైన పీవీ సింధు భారతదేశాన్ని మరోసారి గర్వించేలా చేసిందన్నారు.  BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె బ్యాడ్మింటన్‌ పట్ల చూపించే అభిరుచి మరియు అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు. పీవీ సింధు విజయం తరాల ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందన్నారు.

సింధు విజయం చరిత్రాత్మకం అన్నారు ఏపీ సీఎం జగన్. BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మొదటి ఇండియన్ సింధుకి శుభాకాంక్షలు తెలియజేశారు. గేమ్ ప్రారంభం నుండే ఆధిపత్యం చెలాయించి నిజమైన ఛాంపియన్ లాగా ముగించారంటూ జగన్ ట్వీట్ చేశారు.

సింధు అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిందని, భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సింధుకి శుభాకాంక్షలు తెలియజేశారు.

వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధుకి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మొదటి ఇండియన్ సింధుని చూడటం గర్వంగా ఉందన్నారు. ఆకాశం కూడా నీకు హద్దు కాదు అమ్మా అంటూ బాబు ట్వీట్ చేశారు.