Ashwin Wife: క్రికెటర్ అశ్విన్ ప్రేమ చిట్టాను బయటపెట్టిన భార్య ప్రీతి.. క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి అసలు విషయం చెప్పాడట..

గత పదేళ్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అప్పటికీ ఇప్పటికీ నాకు నీపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. రాబోయే రోజుల్లోనూ ఇలానే ఉంటుందని.. మనిద్దరం పెళ్లిచేసుకుందాం అని అశ్విన్ చెప్పినట్లు ప్రీతి వివరించింది.

Ashwin Wife: క్రికెటర్ అశ్విన్ ప్రేమ చిట్టాను బయటపెట్టిన భార్య ప్రీతి.. క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి  అసలు విషయం చెప్పాడట..

Ravichandran Ashwin

Updated On : May 5, 2023 / 4:05 PM IST

Ashwin Wife: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి అతని భార్య ప్రీతి నారాయ‌ణ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అశ్విన్ పైకి కొంచెం సీరియస్ ఫేస్‌తో కనిపించినప్పటికీ చాలా సరదాగా ఉంటాడని తెలిపింది. తమది ప్రేమ వివాహం, చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. నేనంటే అశ్విన్ కు విపరీతమైన ఇష్టం. ఆ విషయం మా స్కూళ్లో అందరికీ తెలుసని ప్రీతి వెల్లడించింది. తాజాగా జియో సినిమా  ప్రోగ్రామ్ అయిన హ్యాంగ్‌వుట్ లో ప్రీతి పాల్గొంది. ఇందులో హోస్టులుగా మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి, డానిష్ సేత్ లు వ్యవహరించారు. ఈ ప్రోగ్రామ్ లో కింగ్, క్వీన్ అంటూ యూనిక్ చెస్ గేమ్ ఆడుతూ ప్రీతితో సంబాషణ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అశ్విన్ తో ప‌రిచ‌యం, దంపతులు కాకముందు ఎలా ఉంది. దంపతులు అయ్యాక ఎలా ఉంది అనే విషయాలను అడుగగా.. ప్రీతి సమాధానం చెప్పారు.

IPL 2023, SRH vs KKR: ఉప్ప‌ల్‌లో హైద‌రాబాద్‌కు మ‌రో ఓట‌మి.. కోల్‌క‌తా గెలుపు

అశ్విన్, నేను ఒకే స్కూల్‌లో చుదువుకున్నామని ప్రీతి చెప్పింది. అశ్విన్ 7వ తరగతిలో ఉన్నప్పటి నుంచే అశ్విన్ కు నేనంటే ఎంతో ప్రేమ, ఆ విషయం స్కూల్ లో అందరికీ తెలుసని ప్రీతి చెప్పింది. ఆ తరువాత అశ్విన్ క్రికెట్ శిక్షణ పేరుతో స్కూల్ మారాడు. అప్పటి నుంచి మేము కొన్ని సందర్భాల్లో మాత్రమే కలుసుకునేవాళ్లం. తరువాత కాలంలో నాకు ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్లకు నేను చేస్తున్న ఉద్యోగంలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అకౌంట్ ను హ్యాండిల్ చేసేందుకు వెళ్లగా అక్కడ అశ్విన్ కలిశాడు.. వామ్మో.. చాలా హైట్ పెరిగాడని అనుకున్నాన‌ని  ప్రీతి గుర్తు చేసుకుంది. కొన్నిరోజులు మేము తరచూ కలుస్తూ వచ్చాము. అశ్విన్ ఓ రోజు నావద్దకు వచ్చి నన్ను క్రికెట్ మైదానంకు తీసుకెళ్లాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఓపెన్ అయ్యాడు అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రీతి చెప్పింది.

 

Team India cricketer Ashwin family

Team India cricketer Ashwin family

గత పదేళ్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అప్పటికీ ఇప్పటికీ నాకు నీపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. రాబోయే రోజుల్లోనూ ఇలానే ఉంటుందని.. మనిద్దరం పెళ్లిచేసుకుందాం అని అశ్విన్ చెప్పినట్లు ప్రీతి వివరించింది. పెళ్లి తరువాత ఇద్దరం అప్పుడ‌ప్పుడూ గడవపడతాం. అయితే, గొడవ కొద్దిసేపటికి సమసిపోతుంది. మీ షోకు వచ్చే ఉదయంకూడా మేమిద్దరం గొడవ పడ్డాం. ఎక్కువగా అశ్విన్ స్వారీ చెబుతుంటాడు అంటూ తన జీవిత భాగస్వామి అశ్విన్ గురించి ప్రీతి వెల్లడించింది. ర‌విచంద్ర అశ్విన్‌, ప్రీతి నారాయ‌ణ్ కు 2011 న‌వంబ‌ర్ 13న వివాహం జ‌రిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు కూతుళ్లు అఖీరా అశ్విన్‌, ఆధ్య అశ్విన్‌. ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో అశ్విన్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో ఆడుతున్నాడు.