Cristiano Ronaldo:పోర్చుగల్, జ్యూవెంటస్ ఫార్వార్డ్ ప్లేయర్ Cristiano Ronaldoకు కరోనా పాజిటివ్ వచ్చింది. పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం ప్రకటించింది. లక్షణాలు బయటకు కనిపించకుండా రొనాల్డోకు పాజిటివ్ వచ్చింది. స్వీడన్ తో బుధవారం జరగనున్న యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ మ్యాచ్ లో Cristiano Ronaldo ఆడటం లేదు అని ఫెడరేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
35ఏళ్ల వయస్సున్న Cristiano Ronaldo ఐదు సార్లు బాలోనె అవార్డు గెలుచుకున్నారు. ఆదివారం పారిస్ లో ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పోర్చుగల్ ఒక్క గోల్ కూడా చేయకుండా డ్రాగా ముగించింది.
పోర్చుగల్ జట్టులో మిగిలిన వారందరికీ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చెప్పింది. Cristiano Ronaldo పోర్చుగల్ జట్టు తరపున 101గోల్స్ చేశాడు. స్వీడన్ తో జరిగే మ్యాచ్ లో అతని గైర్హాజరీ భారీ ఎఫెక్ట్ చూపించనుంది.
సిరీస్ ఏలో ఆడనున్న Cristiano Ronaldo కచ్చితంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో 10రోజుల పాటు ఉండాల్సిందే. జట్టులోకి వచ్చేముందు మరోసారి టెస్టు చేసి నెగెటివ్ వచ్చాకే మ్యాచ్ ఆడిస్తారు.