IPL 2023: ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు.. సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు.. చిక్కుల్లో చెన్నై..!
టికెట్ల అమ్మకాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయట. సీఎస్‌కే తో పాటు, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) లపై ఓ లాయర్ చెన్నై సివిల్ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు వేశారు.

csk
CSK:ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) దూసుకుపోతుంది. లీగ్ దశలో మే 20న ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తన చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా చెన్నై టాప్-2లో నిలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓ వివాదం చుట్టుముట్టింది.
ఈ సీజన్‌లో చెన్నైలోని చెపాక్ మైదానంలో 7 మ్యాచులు జరిగాయి. ఈ మ్యాచులకు సంబంధించిన టికెట్ల అమ్మకాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయట. సీఎస్‌కే తో పాటు, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) లపై అశోక్ చక్రవర్తి అనే లాయర్ చెన్నై సివిల్ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు వేశారు.
MS Dhoni: ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గజ ఆటగాడు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు
TNCA బ్లాక్‌లో టికెట్లు విక్రయించినట్లు ఆరోపించారు. తక్కువ ధర కలిగిన లోయర్ స్టాండ్ టికెట్లను రూ.8వేలకు విక్రయించినట్లు, ఇందులో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ పాత్ర ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిటిషన్ దాఖలు చేసినట్లు లాయర్ చెప్పారు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి సీజన్ అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేంద్రుడి ఆట చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివస్తున్నారు. టికెట్ ధర ఎంతైనా సరే కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదు.
IPL 2023 playoffs: ప్లే ఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చిన లక్నో విజయం
ఇదిలా ఉంటే.. చెన్నై వేదికగానే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫైయర్ 1 తో పాటు ఎలిమినేటర్ మ్యాచులకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచులకు సంబంధించిన టికెట్లు గురువారం నుంచి ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.