CSK CEO Kasi: ముంబై ఇండియన్స్‌ నుంచి చెన్నై జట్టులోకి రోహిత్, సూర్య? సీఎస్కే సీఈవో ఏమన్నారో తెలుసా?

ఆ స్టార్ ప్లేయర్లు ముగ్గురూ ముంబై నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లోకి మారతారని కూడా ప్రచారం జరుగుతోంది.

CSK CEO Kasi: ముంబై ఇండియన్స్‌ నుంచి చెన్నై జట్టులోకి రోహిత్, సూర్య? సీఎస్కే సీఈవో ఏమన్నారో తెలుసా?

Dhoni Rohit Surya

Updated On : December 20, 2023 / 9:37 PM IST

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై ఎన్నో రకాలుగా ప్రచారం జరుగుతోంది. ముంబై జట్టుకు 5 టైటిళ్లు తెచ్చిపెట్టిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.

దీనిపై ముంబై జట్టు ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఎన్నో ప్రశ్నలు వేశారు. ఫ్రాంచైజీపై ఎన్నో విమర్శలు గుప్పించారు. రోహిత్ శర్మ ట్రేడింగ్ కు రెడీగా ఉన్నారా? అంటూ ఒకట్రెండు ఇతర ఫ్రాంచైజీలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా విషయంలోనూ ఇదే పరిస్థితి.

ఆ స్టార్ ప్లేయర్లు ముగ్గురూ ముంబై నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లోకి మారతారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ఆ ప్రచారాన్ని కొట్టేశారు. ఆటగాడి కొనుగోలు అనేది సీఎస్కే ఆదర్శాలకు వ్యతిరేకమని చెప్పారు.

ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల విషయంలో తాము అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ముంబై జట్టు ఆటగాళ్లతో తామేమీ సంప్రదింపులు జరపలేదని, అటువంటి ఉద్దేశమూ లేదని చెప్పారు.

IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో భారీ ధర లభించడంపై మిచెల్ స్టార్క్ ఏమన్నాడో తెలుసా?.