చెన్నైvsఢిల్లీ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2019సీజన్‌లో ఐదో మ్యాచ్‌కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విసిరిన ఛాలెంజ్‌కు ఫంత్ ప్రతాపం చూపించాల్సిన సమయమిది. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని శాసించి ఈ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవడంతో పోటీ హోరాహోరీగా సాగనుంది.

హిట్టర్ ధావన్ ఢిల్లీకి చేరడం కొద్దిపాటి బలాన్ని చేకూర్చింది. పంత్ తిరిగి ఫామ్ అందుకోవడంతో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్టు యువ క్రికెటర్లతో దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. పిల్లలు వర్సెస్ పెద్దోళ్లుగా జరుగుతోన్న మ్యాచ్‌లో విజయం ఎవరిని వరించనుందో చూడాలి మరి.