CSKvsDC: మిస్టర్ కూల్ వచ్చాడు, ఢిల్లీ టార్గెట్ 180

చెన్నై సొంతగడ్డపై ఢిల్లీ బౌలర్లపై సత్తా చాటింది. ఈ క్రమంలో ఢిల్లీకి 180పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా ఆచితూచి ఆడి వికెట్లు కాపాడుకుంది. క్రమంగా ఊపందుకుని బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించింది. తొలి వికెట్‌గా షేన్ వాట్సన్ నిరాశపరచినప్పటికీ డుప్లెసిస్(39)కు సురేశ్ రైనా(59; 37బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సు)తోడవడంతో చక్కటి భాగస్వామ్యం నమోదు చేశారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఎంఎస్ ధోనీ(44; 22బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు)కు రవీంద్ర జడేజా తోడై(25; 10బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులు)తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 18.3 ఓవర్లకు జడేజా అవుట్ అవడంతో అంబటి రాయుడు(5)పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగించారు. ఢిల్లీ బౌలర్లకు సుచిత్ 2వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీయగలిగారు.