సొంతగడ్డపై ఢిల్లీ సత్తా చాటింది. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. హిట్టర్లను తెలివిగా అవుట్ చేసిన ఢిల్లీ ఆ తర్వాత దిగిన బ్యాట్స్‌మెన్‌ను లాంచనంగా పెవిలియన్‌కు పంపేసింది. ఫీల్డింగ్‌లో విఫలమైన బెంగళూరు.. బ్యాటింగ్‌లోనైనా నిలవలేకపోయింది. ప్లే ఆఫ్ రేసులో నిలిచే అవకాశాలను బెంగళూరు పూర్తిగా చేజార్చుకుంది.
చేధనకు దిగిన బెంగళూరు ఓపెనర్లు పార్థివ్ పటేల్(39) 5.5ఓవర్ల వద్ద రబాడ బౌలింగ్‌లో అక్సర్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో అవుటయ్యాడు. మరో ఓపెనర్ 10బంతుల వ్యవధిలోనే 7.2ఓవర్ల వద్ద విరాట్ కోహ్లీ(23) రూథర్‌ఫర్డ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత డివిలియర్స్(17)పేలవ ప్రదర్శనతో ముగించడంతో శివం దూబె(24)మాత్రమే చేయగలిగాడు.
ఆ తర్వాత క్లాసెన్(3), గుర్కీరత్ సింగ్ మన్(27), మార్కస్ స్టోనిస్(32), వాషింగ్టన్ సుందర్(1), ఉమేశ్ యాదవ్(0)పరుగులతో సరిపెట్టుకున్నారు. కగిసో రబాడ, అమిత్ మిశ్రా చెరో 2వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్, రూథర్‌ఫర్డ్ తలో వికెట్ తీయగలిగారు.