ఢిల్లీ మళ్లీ గెలిచింది. రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరైపోయిన వేళ ఢిల్లీ లీగ్ టేబుల్‌లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్‌లో రిషబ్ పంత్(47; 37బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సులు)తో మెరవడంతో 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
స్వల్ప టార్గెట్‌ను చేధించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆరంభంలో కాస్త తడబాటు కనిపించింది. పృథ్వీ షా(8), శిఖర్ ధావన్(16)లు ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే పెవిలియన్ చేరుకున్నారు. వీరిద్దర్నీ ఇష్ సోథీ వరుస బంతుల్లో ఔట్ చేయడంతో ఢిల్లీ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో శ్రేయస్ అయ్యర్-రిషభ్ పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(15) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.
స్వల్పవిరామంతోనే ఇన్‌గ్రామ్(12) కూడా వెనుదిరగడంతో మ్యాచ్‌ను గెలిపించే బాధ్యత రిషభ్ తీసుకున్నాడు. నిలకడగా ఆడుతూనే సమయానికి తగ్గట్టు బ్యాట్ ఝుళిపించాడు. దీంతో ఢిల్లీ విజయాన్ని సొంతం చేసుకుంది. లీగ్ పట్టికలో రెండో స్థానానికి చేరింది.