DCvsSRH: వందో మ్యాచ్ గోవిందా.. ఢిల్లీ ఘన విజయం

ఉప్పల్ వేదికగా జరిగిన వందో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. 156పరుగుల టార్గెట్ ను కూడా చేధించలేక ఢిల్లీ ముందు పరాజయాన్ని మూటగట్టుకుంది. మార్పులు చేసుకుని 4ప్లేయర్లను జట్టులోకి దింపిన రైజర్స్ ఓపెనర్లు మినహాయించి మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైయ్యారు.
డేవిడ్ వార్నర్(51), జానీ బెయిర్ స్టో(41) మాత్రమే జట్టుకు స్కోరు తెచ్చిపెట్టారు. విలియమ్సన్(3), రిక్కీ బుయ్(7), విజయ్ శంకర్(7), విజయ్ శంకర్(1), దీపక్ హుడా(3), అభిషేక్ శర్మ(2), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్(2), సందీప్ శర్మ(1), ఖలీల్ అహ్మద్(0)పరుగులకే పరిమితమై జట్టుకు ఓటమిని కొన్ని తెచ్చుకున్నారు.
ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడ(4)వికెట్లు పడగొట్టగా, క్రిస్ మోరిస్(3), కీమో పాల్(3)వికెట్లతో విజృంభించారు.