PV Sindhu – Deepika Padukone: పీవీ సింధు వర్సెస్ దీపికా పదుకొనె.. గెలుపెవరిదో తెలుసా

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వర్సెస్ దీపికా పదుకొణె ఒక మ్యాచ్ జరిగింది. వరల్డ్ మెగా టోర్నీ అయిన ఒలింపిక్స్ లో రెండు సార్లు విజేతగా నిలిచిన పీవీ సింధు.. ఈ మద్య దీపికా పదుకొణె..

PV Sindhu – Deepika Padukone: పీవీ సింధు వర్సెస్ దీపికా పదుకొనె.. గెలుపెవరిదో తెలుసా

Pv Sindhu Deepika

Updated On : September 23, 2021 / 12:05 PM IST

PV Sindhu – Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వర్సెస్ దీపికా పదుకొణె ఒక మ్యాచ్ జరిగింది. వరల్డ్ మెగా టోర్నీ అయిన ఒలింపిక్స్ లో రెండు సార్లు విజేతగా నిలిచిన పీవీ సింధు.. ఈ మద్య దీపికా పదుకొణె.. రణవీర్ సింగ్ లతో కలిసి దిగిన ఫొటో పోస్టు చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు దీపికాతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

సరదాగా.. ఫిట్‌నెస్ కోసం ఇద్దరూ కలిసి వందల క్యాలరీలు ఖర్చు అయ్యేలా ఆడారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కేవలం ఫిట్ నెస్ కోసమే ఆడామని స్టార్లు ఇద్దరూ రాసుకొచ్చారు. వరల్డ్ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పీవీ సిందుతో ఆడటం సంతోషంగా ఉందని దీపికా చెప్పుకొచ్చారు.

ఇద్దరి మధ్య సరదగా సోషల్ మీడియాలో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో షేర్ చేసుకున్నారు. వైరల్‌గా మారిన ఈ ఫొటోలకు మిశ్రమ స్పందనతో కూడిన కామెంట్లు వస్తున్నాయి. సింధుకు పోటీ ఇస్తూ దీపిక కోర్టులో కదలడం చూసి బయోపిక్ కోసం దీపికా రెడీ అవుతుంది. పీవీ సింధు బయోపిక్ రాబోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

………………………….Read Also : వామ్మో.. పాక్ పోలీసుల బిర్యానీ బిల్లు 7 రోజుల్లో రూ.27లక్షలు

దీపికా తండ్రి ప్రకాష్ పదుకొనే ఫ్యామస్ బాట్మింటన్ ప్లేయర్. ఆయన శిష్యుడిగా గోపీచంద్ రాణించగా.. అతనికే శిష్యురాలిగా పీవీ సింధు ప్రపంచస్థాయికి చేరింది.

దీపికా కూడా తండ్రి బాటలోనే ప్రయాణించాలని కొన్ని బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడింది. ఈమెలోని ప్రత్యేక టాలెంట్ ను గుర్తించిన బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంతో పద్మావతి, బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించగలిగింది.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)