క్రికెట్ ఫ్యాన్స్‌లో భయంకరమైన ఒత్తిడి

క్రికెట్ ఫ్యాన్స్‌లో భయంకరమైన ఒత్తిడి

Updated On : January 27, 2020 / 1:29 AM IST

దేనిపైనైనా ఇష్టం ఉంటుంది కానీ, క్రీడలంటే మాత్రం అంతకుమించిన ఫీలింగ్. టీవీ ముందు కూర్చొనే కేకలు పెట్టే వాళ్లు ఉంటే.. ఇక స్టేడియంలో ఉన్న వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఓ పక్కన టార్గెట్ కళ్ల ముందు కనపడుతూ ఉంటుంది. మరో వైపు ప్లేయర్ల పర్‌ఫార్మెన్స్ కట్టలు తెంచుకుని వచ్చే అవకాశం. భయంకరమైన ఆ క్షణాలు మైండ్‌కు తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుందంట. 

వరల్డ్ కప్ టోర్నీనే చూస్తే ధోనీ అవుట్ తో ఆశలన్నీ ఆవిరి అయిపోయాయ్. ఆ రనౌట్ కు ముందు గుప్పెడు మూసి మ్యాచ్ చూస్తూ ఎంత టెన్షన్ పడ్డామో.. మనకే తెలుసు. కానీ, ఇలాంటి ఒత్తిడి కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమేనట. బీపీ నుంచి పెంచి బాగా ఒత్తిడికి గురయ్యేలా చేస్తుందని అధ్యయనం చెబుతుంది. 

గేమ్ చూసే వాళ్లల్లో ఆడమగా తేడా లేకుండా ఇద్దరిలోనూ ఒకటే ఒత్తిడి స్థాయి ఉంటుందని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఈ మేర ఆక్స్‌ఫర్డ్‌లోని రీసెర్చర్ మార్తా న్యూసన్ ఇలా అన్నారు. 

‘జట్టుతో స్ట్రాంగ్ బాండింగ్‌తో ఉండడం వల్ల ఒక్కో పాయింట్ ఓడిపోతుంటే ఫిజికల్‌గా స్ట్రెస్ ఫీలవుతూ బాధపడిపోతూ ఉంటారు. వీటివల్ల..

* రక్తకణాల్లో మార్పులు
* బీపీ పెరిగిపోతుండటం
* గుండె జబ్బులు ఉన్నవాళ్లైతే ఆగిపోయే ప్రమాదం

మ్యాచ్ నిర్వాహకులకు మాత్రం అభిమానుల ఎగ్జైట్‌మెంటే పెట్టుబడి.. స్టేడియంలలో బయట రోడ్ల మీద పెద్ద పెద్ద స్క్రీన్ లు పెట్టి మ్యాచ్ లైవ్ ఇచ్చేస్తుంటుంది. స్ట్రెస్ ఫీలవుతున్నా.. పట్టించుకోకుండా గంటల తరబడి టైం కేటాయించుకుంటూ ప్రమాదాలు తెచ్చుకుంటారు అభిమానులు. ఈ మేర క్రీడాసక్తి ఎక్కువ ఉన్న వారిపై చేసిన సర్వేలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.