Ruturaj Gaikwad : ల‌క్నో పై ఓట‌మి.. రుతురాజ్ గైక్వాడ్ కీల‌క వ్యాఖ్య‌లు..

మ్యాచ్ అనంత‌రం ఓట‌మిపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు.

CSK skipper Ruturaj Gaikwad : ఈ సీజ‌న్‌లో సొంత గ‌డ్డ‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ మొద‌టి ఓట‌మిని చ‌వి చూసింది. మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంత‌రం ఓట‌మిపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. ల‌క్నో ఆట‌గాడు మార్క‌స్ స్టోయినిస్ అసాధార‌ణ బ్యాటింగ్ కార‌ణంగానే విజ‌యం సాధించాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామ‌న్నాడు. ఇక డ్యూ ఫ్యాక్ట‌ర్ కూడా త‌మ గెలుపు అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసింద‌ని చెప్పాడు.

‘ఈ మ్యాచ్‌లో ఓడిపోవ‌డం చాలా క‌ష్టంగా ఉంది. ఇదొక మంచి మ్యాచ్‌. ల‌క్నో అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ల‌క్నో ఇన్నింగ్స్‌లో 13-14 ఓవ‌ర్ల వ‌ర‌కు కూడా మ్యాచ్ మా చేతులోనే ఉంది. అయితే.. స్టోయినిస్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మంచు కూడా కీల‌క పాత్ర పోషించింది. తేమ ఎక్కువ‌గా ఉండ‌డంతో మా స్పిన్న‌ర్ల‌కు బంతి పై ప‌ట్టు దొర‌క‌లేదు. అయిన‌ప్ప‌టికీ పేస‌ర్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మ్యాచ్‌ను చివ‌రి వ‌ర‌కు తీసుకువెళ్లారు.’ అని రుతురాజ్ అన్నాడు.

Marcus Stoinis : చ‌రిత్ర సృష్టించిన మార్క‌స్ స్టోయినిస్‌.. 13 ఏళ్ల నాటి రికార్డు బ‌ద్ద‌లు..

ఇక ఆట‌లో గెలుపోట‌ములు స‌హ‌జం అని రుతురాజ్ అన్నాడు. ర‌వీంద్ర జ‌డేజాల‌ను నాలుగో స్థానంలో పంప‌డం పై స్పందించాడు. ప‌వ‌ర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోవ‌డంతోనే జ‌డ్డూని నాలుగో స్థానంలో పంపిన‌ట్లు వెల్ల‌డించాడు. ప‌వ‌ర్ ప్లే త‌రువాత‌నే దూబేను పంపాల‌ని ముందే నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పాడు. వాస్త‌వానికి ఇలాంటి వికెట్ పై మేం సాధించిన ప‌రుగులు స‌రిపోవు. మ‌రో 15 నుంచి 20 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ల‌క్నో జ‌ట్టు గొప్ప‌గా ఆడింద‌ని రుతురాజ్ తెలిపాడు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్; 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ) శతకంతో చెలరేగగా శివమ్ దూబే(66; 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మోహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Yashasvi Jaiswal : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డును బ్రేక్ చేసిన జైస్వాల్‌..

అనంతరం ల‌క్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్కస్ స్టోయినిస్(124 నాటౌట్; 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స‌ర్లు ) విధ్వంస‌క‌ర శ‌త‌కం చేయ‌గా నికోలస్ పూరన్(34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), దీపక్ హుడా(17 నాటౌట్; 6 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ ) వేగంగా ఆడారు.

ట్రెండింగ్ వార్తలు