ధోనీ లాంగ్ హెయిర్ కట్ చేయడానికి కారణం దీపికానేనట!!

సెలబ్రిటీల మధ్య లవ్ స్టోరీలకు ఓ మాదిరి క్రేజ్ ఉంటే, క్రికెటర్లకు సినిమా హీరోయిన్లకు మధ్య జరిగిన ప్రేమ కథలకు, అఫైర్లకు మాత్రం బీభత్సమైన పబ్లిసిటీ ఉంటుంది. ఇలాంటి ప్రేమ కథల్లోనే ఒకటి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేల కథ. కొన్నాళ్లపాటు సజావుగానే సాగిన వీరి ప్రేమ కథ అనుకోకుండా ఎవరి దారి వారు చూసుకునేలా చేసింది. 

మహీ టీమిండియా కెప్టెన్సీ వహిస్తున్న రోజుల్లో ఓ పార్టీకి హాజరైయ్యాడట. ఆ పార్టీకి వచ్చిన దీపికా పదుకొణే ధోనీని చూడగానే ఇంప్రెస్ అయిపోయిందట. టీమిండియా కెప్టెన్ కరిష్మాను చూసి ఎట్రాక్ట్ అయిన దీపికా చాలా కాలం పాటు క్లోజ్ గా తిరిగింది.  ఇంకేముంది మ్యాచ్ చూసేందుకు స్టేడియంలో టిక్కెట్లు, కలిసి డిన్నర్ చేయడాలు బాగానే జరిగిపోయాయి. 

ఈ క్రమంలో అతని లాంగ్ హెయిర్ కట్ చేయించుకోమని చెప్పడంతో ధోనీ అంతటి పని చేశాడు. కానీ, కొన్నాళ్లకు కథ మరోలా తిరిగింది. టీమిండియాలోని మరో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో చనువుగా ఉండడం మొదలుపెట్టింది దీపికా. అంతే కంగుతిన్న ధోనీ.. దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. యువీ కోసం ప్రేమను త్యాగం చేసినా ఆ తర్వాత కొద్ది రోజులకు యువరాజ్‌ను కూడా సైడ్ చేసేసింది దీపికా పదుకొనే.