ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో ధోనీ సత్తా చాటాడు. క్రీజులో కుదురుకోవడానికే తటాపటాయిస్తున్న తరుణంలో అనుభవంతో పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఆడిన మూడు వన్డేల్లోనూ వరుసగా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని హ్యాట్రిక్ సాధించాడు.
తొలి మ్యాచ్‌లో 51 పరుగులు చేసి ఎల్బీగా అవుటయ్యాడు. ఇక రెండో మ్యాచ్‌లో తానే అన్నీ అయి జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత నిర్ణయాత్మక వన్డే అయిన మూడో వన్డేలో సైతం 74 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. కాగా, ఇది ధోనీ కెరీర్‌లో 70వ అర్థ శతకం. ధోనీ ఒకేసారి మూడు అంతకన్నా ఎక్కువ హాఫ్ సెంచరీలు బాదడం ఇది ఐదోసారి. 2014 జనవరిలో న్యూజిలాండ్‌పై చివరి సారి ఈ ఘనత నమోదు చేశాడు.
FIFTY!@msdhoni in 2019
Matches: 3 ✔️
50s: 3✔️
Average: 150 plus✔️#AUSvIND #TeamIndia pic.twitter.com/uyJQAvmKe7— BCCI (@BCCI) January 18, 2019