కోహ్లీకి ధోనీ వార్నింగ్: లేట్ చేయొద్దు

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 12వ సీజన్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఎనిమిది ఫ్రాంచైజీలు ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీ అయిపోయాయి. కొద్ది రోజుల ముందే ఐపీఎల్ టీజర్ అంటూ విడుదల చేసిన వీడియోలో యువ ఆటగాళ్లతో ధోనీ.. కోహ్లీలు చాలెంజ్ చేశారు. గురువారం ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ద్వారా మరో వీడియో విడుదల చేసింది. 
Read Also: నో యోయో: చెన్నై సూపర్ కింగ్స్‌ స్పెషల్

అందులో ధోనీ.. కోహ్లీని లేట్‌గా రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. వీడియోలో.. కోహ్లీ.. కోహ్లీ.. ధోనీ.. ధోనీ అని అరుపులు వినిపిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న ఇద్దరు కెప్టెన్ల మధ్య సంభాషణ ఇలా ఉంది. కోహ్లీ చాయ్ తాగుతూనే.. వినబడుతున్నాయా.. ఏమంటావ్ అని ధోనీని ప్రశ్నించాడు. దానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏముంది కోహ్లీ.. ధోనీ అంటే రెండు పేర్లేగా అని కొట్టిపారేశాడు. 

దానికి బదులుగా కోహ్లీ ఆ అంతేలే.. చూద్దాం ఐపీఎల్ మొదలవుతుందిగా అన్నాడు. వెంటనే చాయ్ ఫినిష్ చేసిన ధోనీ సరేలే అక్కడే చూసుకుందాం. నువ్వు మాత్రం లేట్ గా రావొద్దంటూ కోహ్లీకి కౌంటర్ వేసి వెళ్లిపోతాడు. మార్చి 23 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ సీజన్‌కు బీభత్సమైన హడావుడి జరుగుతుంది. బుధవారం మార్చి 13న ముగిసిన వన్డే సిరీస్ అనంతరం టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్ కు ప్రాక్టీస్ అయ్యేందుకు సిద్ధమైపోయారు. 
 

Read Also: న్యూజిలాండ్ ఘటనపై విచారంలో కోహ్లీ