Shoaib Malik : షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై ఏడాది క్రితమే హింట్ ఇచ్చాడా?

షోయబ్ మాలిక్ సనా జావెద్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు గతేడాది హింట్ ఇచ్చారా? గతేడాది షోయబ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే నిజమే అనిపిస్తోంది.

Shoaib Malik : షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై ఏడాది క్రితమే హింట్ ఇచ్చాడా?

Shoaib Malik

Updated On : January 20, 2024 / 5:02 PM IST

Shoaib Malik : షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే షోయబ్ తన మూడో పెళ్లిపై గతేడాది హింట్ ఇచ్చారా? షోయబ్ గతేడాది తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సనాతో ఉన్న ఫోటో పోస్టు చేయడం చూస్తే ఇప్పుడది నిజమనిపిస్తోంది.

మూడో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్‌.. సానియాతో విడాకులు నిజ‌మేనా?

షోయబ్ మాలిక్-సనా జావెద్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటి నుండో సానియా-షోయబ్‌ల విడాకుల వార్త నలుగుతున్నా ఇద్దరిలో ఎవరూ స్పందించకపోవడం.. సడెన్‌గా షోయబ్ మూడో పెళ్లి ప్రకటనతో అసలు విషయాన్ని బయటపెట్టడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. కాగా షోయబ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే గతేడాది పాకిస్తానీ నటి సనా జావేద్ బర్త్ డే సందర్భంలో ఆమెతో దిగిన ఫోటోను షోయబ్ షేర్ చేసారు. హ్యాపీ బర్త్ డే బడ్డీ అనే క్యాప్షన్‌తో పోస్టు పెట్టారు. అంటే ఏడాది క్రితమే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారనే విషయం అర్ధం అవుతోంది.

Imran Mirza : షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా తండ్రి ఏమన్నారంటే….?

ఇక షోయబ్-సనాల పాత ఫోటో చూస్తుంటే సానియా-షోయబ్‌లు విడిపోవడానికి చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సనాని పెళ్లి చేసుకున్న తర్వాతే సానియాతో విడిపోయినట్లు షోయబ్ ప్రకటించాలని ముందే డెసిషన్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు ‘ఇలా మీ ప్రేమ కథ మొదలైందన్న మాట’ అని కొందరు.. ‘శాడ్ ఫర్ సానియా’ అని కొందరు స్పందించారు. చాలామంది సానియా-షోయబ్-సనా జావేద్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Malik (@realshoaibmalik)