షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా తండ్రి ఏమన్నారంటే..?

షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడినట్లు ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా తన కుమార్తెతో షోయబ్ విడిపోవడంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు.

షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా తండ్రి ఏమన్నారంటే..?

Imran Mirza

Imran Mirza : తన అల్లుడు షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ముస్లిం చట్టం ‘ఖులా’ ప్రకారం షోయబ్ మాలిక్, సానియా విడిపోయారని స్పష్టం చేశారు. భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా భర్త.. క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడం వార్తల్లో నిలిచింది. జనవరి 20న పాకిస్తానీ నటి సనా జావేద్‌ను పెళ్లాడినట్లు తమ పెళ్లి ఫోటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

ఈ విషయంపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ముస్లిం లా ‘ఖులా’ ప్రకారం విడిపోయారని.. ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును ఖులా సూచిస్తుందని తెలిపారు. ఖులా అనేది స్త్రీ తన భర్త నుండి విడాకులు కోరే ఒక ప్రక్రియ. ఇది వరకట్నాన్ని తిరిగి ఇవ్వడం లేదా తన హక్కులలో కొంత భాగాన్ని వదులుకోవడం. తన భర్త నుండి విడాకులు కోరుకునే అవకాశం ముస్లిం స్త్రీకి ఖులా చట్టం కల్పిస్తుంది.

Also Read: ఏదీ క‌ష్టం.. పెళ్లి చేసుకోవ‌డ‌మా ? విడాకులు తీసుకోవ‌డ‌మా ?

సానియా మీర్జా మాలిక్ రెండవ భార్య.. ఏప్రియల్ 12, 2010న హైదరాబాద్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి 2018 లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు పుట్టాడు. రెండేళ్లుగా సానియా, షోయబ్‌ల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వీరిద్దరూ ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. కాగా షోయబ్ మూడవ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు షేర్ చేసిన అందరినీ ఆశ్చర్యపరిచారు. షోయబ్ పెళ్లాడిన పాకిస్తానీ నటి సనా జావేద్‌కి గతంలో పెళ్లైంది. 2020 లో పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను ఆమె పెళ్లాడారు. సనా జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును సనా షోయబ్ మాలిక్‌గా మార్చుకున్నారు.

Also Read: మూడో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్‌.. సానియాతో విడాకులు నిజ‌మేనా?