ENG vs IND : గిల్ చెప్పిన ఆ ఒక్క మాట.. ఓవల్‌లో మ్యాచ్ గమనాన్నే మార్చేసిందా?
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు క్లైమాక్స్‌కు చేరుకుంది.

Did that one word from Gill change the course of the match at the Oval
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు క్లైమాక్స్‌కు చేరుకుంది. చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న క్రమంలో ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత్ నాలుగు వికెట్లు తీస్తేనే గెలుస్తుంది.
నాలుగో రోజు హ్యారీ బ్రూక్, జోరూట్ లు సెంచరీలు సాధించడంతో ఓ దశలో టీమ్ఇండియా ఓటమి దిశగా సాగింది. అయితే.. ఆ సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. “ఇంకో గంట సేపు మనందరం కష్టపడదాం.. ఆ తరువాత అందరం కలిసి విశ్రాంతి తీసుకుందాం.” అంటూ గిల్ చెప్పిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి.
ఇలా చెప్పిన కొన్ని నిమిషాల్లోనే టీమ్ఇండియా అద్భుతంగా పుంజుకుంది. సెంచరీ ఆటగాళ్ల వికెట్లు తీయడంతో పాటు బెతెల్ వికెట్‌ను పడగొట్టి టీమ్ఇండియా మ్యాచ్ రేసులోకి వచ్చింది. దీంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) లు క్రీజులో ఉన్నారు.
వోక్స్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయడం అనుమానమే. తొలి ఇన్నింగ్స్‌లోనూ అతడు బ్యాటింగ్ చేయలేదు. దీంతో భారత్ మూడు వికెట్లు తీస్తే సిరీస్‌ను భారత్ సమం చేయవచ్చు.