Dinesh Karthik: దినేశ్ కార్తీక్‌కు డబుల్ ధమాకా.. దీపికా పల్లికల్‌కు కవలలు

టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్‌ డబుల్ డమాకా కొట్టేశాడు. తన భార్య దీపికా పల్లికల్ కు ఇద్దరు మగ కవలలు పుట్టారు. గురువారం తన భార్య డెలివరీ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో

Dinesh Karthik: దినేశ్ కార్తీక్‌కు డబుల్ ధమాకా.. దీపికా పల్లికల్‌కు కవలలు

Dinesh Karthik Dipika Pallikal

Updated On : October 29, 2021 / 10:38 AM IST

Dinesh Karthik: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్‌ డబుల్ డమాకా కొట్టేశాడు. తన భార్య దీపికా పల్లికల్ కు ఇద్దరు మగ కవలలు పుట్టారు. గురువారం తన భార్య డెలివరీ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. తన పేరుతో పాటు భార్య పేరు కలిసేలా వారికి కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు ప్రకటించాడు.

ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలతో భార్యతో పాటుగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ముగ్గురం ఐదుగురం అయ్యాం’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇక్కడ డీకే తన కుటుంబంలో పెంపుడు కుక్కను కూడా కలుపుకుని చెప్పడం విశేషం.

ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికా పల్లికల్‌తో దినేశ్ కార్తీక్ వివాహం 2015లో జరిగింది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లో పలు పతకాలు సాధించారు.

………………………………………….: త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నాలుగోసారి.. ‘అల వైకుంఠపురంలో’ సీక్వెల్??

దినేశ్ కార్తీక్ కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించి చివరిసారిగా ఐపీఎల్ 2021సీజన్లో మైదానంలో కనిపించారు. ఫైనల్ వరకూ వెళ్లిన నైట్ రైడర్స్ మాస్టర్ మైండ్ ధోనీ దెబ్బకు 27పరుగుల తేడాతో ఓడిపోవడంతో టైటిల్ చేజార్చుకుంది.