Dinesh Karthik : టీ20 ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఎంపికపై క్లారిటీ వచ్చినట్లేనా..! కార్తీక్ ఏమన్నారంటే?

2024 ఐపీఎల్ సీజన్ లో దినేశ్ కార్తీక్ ఏడు మ్యాచ్ లలో 226 పరుగులు చేశాడు. సీఎస్కే జట్టుపై 26 బంతుల్లో 38 పరుగులు చేయగా..

Dinesh Karthik : టీ20 ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఎంపికపై క్లారిటీ వచ్చినట్లేనా..! కార్తీక్ ఏమన్నారంటే?

Dinesh Karthik

T20 World Cup : ఐపీఎల్ 2024 సీజన్ లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్న కార్తీక్.. ఆ జట్టు వరుస ఓటములతో టోర్నీలో విఫలమవుతున్నప్పటికీ.. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. చివరి ఓవర్లలో ఎలాంటి బౌలర్ అయినా పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సీజన్ లో దినేశ్ కార్తీక్ ఏడు మ్యాచ్ లలో 205.45 స్ట్రైక్ రేట్ తో 226 పరుగులు చేశారు. దీంతో జూన్ 1వ తేదీ నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ కు దినేశ్ కార్తీక్ ఎంపిక ఖాయమన్న చర్చ జరుగుతుంది. సీనియర్ ప్లేయర్ అయిన అతన్ని ఈసారి ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాల సమాచారం.

Also Read : IPL 2024 : ఎనిమిదేళ్ల క్రిస్ మోరిస్ రికార్డును బద్దలు కొట్టిన జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్..

టీ20 ప్రపంచ కప్ జట్టులో ఎంపిక విషయంపై దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. నా జీవితంలో ఈ దశలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా పెద్ద విషయం. జట్టులో భాగమయ్యేందుకు నేను 100శాతం సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో దినేశ్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కీపింగ్, బ్యాటింగ్ లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ కు వెళ్లే టీమిండియా జట్టులో దినేశ్ కార్తీక్ భాగమవుతాడా? లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Also Read : IPL 2024 : వరుసగా నాల్గోసారి అదరగొట్టిన హైదరాబాద్.. 67 పరుగులతో ఢిల్లీపై ఘనవిజయం

2024 ఐపీఎల్ సీజన్ లో దినేశ్ కార్తీక్ ఏడు మ్యాచ్ లలో 226 పరుగులు చేశాడు. సీఎస్కే జట్టుపై 26 బంతుల్లో 38 పరుగులు చేయగా.. పంజాబ్ కింగ్స్ పై 10 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. కేకేఆర్ జట్టుపై ఎనిమిది బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టుపై కార్తీక్ కేవలం 23 బంతుల్లో 53 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మొత్తం ఏడు మ్యాచ్ లలో పంజాబ్ కింగ్స్ జట్టుపై మినహా అన్ని మ్యాచ్ లలో ఆర్సీబీ జట్టు ఓడిపోయింది.