Asia Cup 2023 : ఆసియా కప్ మ్యాచులను ఫ్రీగా చూడొచ్చు.. ఎక్కడంటే..?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇస్తున్నాయి.
![Asia Cup 2023 : ఆసియా కప్ మ్యాచులను ఫ్రీగా చూడొచ్చు.. ఎక్కడంటే..? Asia Cup 2023 : ఆసియా కప్ మ్యాచులను ఫ్రీగా చూడొచ్చు.. ఎక్కడంటే..?](https://10tv.in/wp-content/uploads/2023/08/Asia-Cup-1.jpg)
Asia Cup
Asia Cup : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ సారి వన్డే ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. మొత్తం 13 మ్యాచుల్లో 9 శ్రీలంకలో నాలుగు పాకిస్తాన్లో జరగనున్నాయి. ఇక టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు దృష్టి ఓ దానిపై పడింది. ఈ మ్యాచులు ఎందులో ప్రసారం అవుతాయి. ఎలా చూడొచ్చు అన్న దానిపై నెటీజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
డిస్నీ + హాట్‌స్టార్ గుడ్‌న్యూస్..
ఆసియా కప్ 2023ని చూడాలని బావిస్తున్న వారికి డిస్నీ + హాట్‌స్టార్ (Disney + Hotstar) శుభవార్త చెప్పింది. తమ యాప్‌లో మ్యాచులను ఉచితంగా చూడొచ్చునని తెలిపింది. అయితే.. ఇది కేవలం మొబైల్లో మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఎక్కడికి వెళ్లినా కూడా అవాంతరాలు లేకుండా మ్యాచులను చూడొచ్చు అనే అర్థం వచ్చేలా ఈ వీడియో ఉంది. ఎక్కువ మందిని తమ ఫ్లాట్‌ఫామ్‌ను చేరువ చేయడమే హాట్ స్టార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే మ్యాచులను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది.
Virat Kohli : కోహ్లీ క్రికెటర్ కాకపోయుంటే ఏ క్రీడలో రాణించేవాడు..? భువనేశ్వర్ కుమార్ ఏం చెప్పాడంటే..
‘భారతీయుల హృదయాల్లో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మా వినియోగదారులకు ఈ క్రీడను మరింత అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాము. ఆసియా కప్, రాబోయే వన్డే ప్రపంచకప్‌ని సైతం మొబైల్లో ఉచితంగా వీక్షించే అవకాశాన్ని అందించడం ద్వారా, క్రికెట్‌ను దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లి డిజిటల్-ఫస్ట్ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మేము సన్నద్ధమయ్యాము.’ అంటూ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రతినిధి తెలిపారు.
17 మందితో జట్టును ప్రకటించిన భారత్
ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. ఇందులో 17 మందికి చోటు ఇచ్చింది. గాయాలతో కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు చోటు ఇచ్చింది. అదే విధంగా యువ సంచలనం, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు తొలి సారి వన్డేల్లో చోటు దక్కింది. ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో ఆడనుంది.
Yuzvendra Chahal : ఆసియా కప్‌లో దక్కని చోటు.. చహల్ ట్వీట్ వైరల్