Do you Know how many Indian Players played more than 300 ODIs VM
పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. కోహ్లీ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 299 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 287 ఇన్నింగ్స్‌ల్లో 58.2 సగటుతో 14085 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. అంతేకాకుండా వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం (మార్చి 2న) జరగబోయే మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ కానుంది. ఈ క్రమంలో వన్డేల్లో 300వ మ్యాచ్ ఆడిన ఏడో భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డులకు ఎక్కనున్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, అజారుద్దీన్ లు కోహ్లీ కంటే ముందు 300 కంటే ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడారు.
ఇక ఓవరాల్ తీసుకుంటే 22వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.
వన్డేల్లో 300 మ్యాచ్‌ల కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ – 463 మ్యాచ్‌లు
ఎంఎస్ ధోని – 350 మ్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ – 344 మ్యాచ్‌లు
మహమ్మద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్‌లు
సౌరవ్ గంగూలీ – 311 మ్యాచ్‌లు
యువరాజ్ సింగ్ – 304 మ్యాచ్‌లు
అంతర్జాతీయ క్రికెట్‌లో 300 ఫ్లస్ వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 463 మ్యాచ్‌లు
జయవర్థనే (శ్రీలంక) – 448 మ్యాచ్‌లు
జయసూర్య (శ్రీలంక) – 445 మ్యాచ్‌లు
కుమార సంగక్కర (శ్రీలంక) – 404 మ్యాచ్‌లు
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 398 మ్యాచ్‌లు
ఇంజామామ్ ఉల్ హక్ (పాకిస్తాన్) – 378 మ్యాచ్‌లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 375 మ్యాచ్‌లు
వసీం అక్రమ్ (పాకిస్తాన్) – 356 మ్యాచ్‌లు
ఎంఎస్ ధోని (భారత్) – 350 మ్యాచ్‌లు
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 350 మ్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 344 మ్యాచ్‌లు
అజారుద్దీన్ (భారత్) – 334 మ్యాచ్‌లు
తిలక్ రత్నే దిల్షాన్ (శ్రీలంక) – 330 మ్యాచ్‌లు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 328 మ్యాచ్‌లు
స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 325 మ్యాచ్‌లు
చమిందా వాస్ (శ్రీలంక) – 322 మ్యాచ్‌లు
సౌరవ్ గంగూలీ (భారత్) -311 మ్యాచ్‌లు
డిసిల్వా (శ్రీలంక) – 308 మ్యాచ్‌లు
యువరాజ్ సింగ్ (భారత్) – 304 మ్యాచ్‌లు
షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా) – 303 మ్యాచ్‌లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 301 మ్యాచ్‌లు