Do you know where to watch World Championship of Legends matchs
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) రెండో సీజన్ నేటి (జూలై 18, శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్టుతో పాకిస్థాన్ ఛాంపియన్స్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన ఇండియా ఛాంపియన్స్ మరోసారి యువీ సారథ్యంలో టైటిల్ గెలవాలని భావిస్తోంది. మొత్తం ఆరు జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు కప్పు కోసం పోటీపడనున్నాయి.
ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం నాలుగు వేదికలు.. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇదే..
యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్
ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు మైదానంలో విన్యాసాలను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌లను టీవీల్లో ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
మన దేశంలో ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ 1 ఛానెల్‌లో చూడొచ్చు. అలాగే డిజిటల్‌లో ఫ్యాన్ కోడ్ యాప్‌లో చూడొచ్చు. పాకిస్థాన్‌లో తమాషా యాప్, USA & కెనడా దేశాల్లో విల్లో టీవీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లో TNT స్పోర్ట్స్, ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్ స్ట్రీమ్, కయో స్పోర్ట్స్, ఫాక్స్‌టెల్, దక్షిణాఫ్రికాలో సూపర్‌స్పోర్ట్ ఛానెల్స్‌లో చూడొచ్చు.
WCL 2025 షెడ్యూల్ ఇదే..
జూలై 18 – ఇంగ్లాండ్ ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్థాన్ ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 19 – వెస్టిండీస్ ఛాంపియన్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 19 – ఇంగ్లాండ్ ఛాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 20 – ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్థాన్ ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 22 – ఇంగ్లాండ్ ఛాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ ఛాంపియన్స్ – సాయంత్రం 5 గంటలు
జూలై 22 – ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 23 – ఆస్ట్రేలియా ఛాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 24 – దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 25 – పాకిస్తాన్ ఛాంపియన్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 26 – ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 26 – పాకిస్థాన్ ఛాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 27 – దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 27 – ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 29 – ఆస్ట్రేలియా ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 29 – ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ ఛాంపియన్స్ – రాత్రి 9 గంటలకు
జూలై 31 – సెమీఫైనల్ 1- సాయంత్రం 5 గంటలకు
జూలై 31 – సెమీఫైనల్ 2 – రాత్రి 9 గంటలకు
ఆగస్టు 2 – ఫైనల్ – రాత్రి 9 గంటలకు