ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భార‌త్‌కు బిగ్‌షాక్‌.. స్టార్ పేస‌ర్‌కు గాయం.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భార‌త్‌కు బిగ్‌షాక్‌.. స్టార్ పేస‌ర్‌కు గాయం.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..

Massive injury scare ahead of crucial fourth Test against England

Updated On : July 18, 2025 / 9:11 AM IST

అండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జ‌రుగుతోంది. ఇరు జ‌ట్లు కూడా నువ్వా నేనా అన్న‌ట్లుగా త‌ల‌ప‌డుతున్నాయి. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెల‌వ‌గా, రెండో టెస్టులో భార‌త్ విజ‌యం సాధించింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలిచింది. ప్ర‌స్తుతం సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక జూలై 23 నుంచి 27 వ‌ర‌కు నాలుగో టెస్టు మ్యాచ్ మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌ర‌గనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ను స‌మం చేయాల‌ని భార‌త్ భావిస్తోంది.

అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్ దీప్ సింగ్ గాయ‌ప‌డ్డాడు. గురువారం నెట్స్‌లో ప్రాక్టీస్ సెష‌న్‌లో అత‌డి చేతికి గాయ‌మైంది. ఈ విష‌యాన్ని టీమ్ఇండియా స‌హాయ‌క కోచ్ టెన్ డ‌స్కాటె వెల్ల‌డించాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. 61 ఏళ్ల రికార్డు పై రిష‌బ్ పంత్ క‌న్ను..

నెట్స్‌లో సాయి సుద‌ర్శ‌న్ కొట్టిన బంతిని ఆపే ప్ర‌య‌త్నంలో అత‌డి చేతికి గాయ‌మైంద‌ని చెప్పాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి తీసుకుని వెళ్లిన‌ట్లు వివ‌రించాడు. గాయం తీవ్ర‌త‌పై ప్ర‌స్తుతానికి తన వ‌ద్ద ఎలాంటి సమాచారం లేద‌ని, ఒక‌వేళ కుట్లు ప‌డితే మాత్రం అత‌డు కొన్ని రోజులు ఆట‌కు దూరం అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చాడు.

KSCA T20 Auction : పాపం రాహుల్ ద్ర‌విడ్‌.. పెద్ద కొడుకు స‌మిత్‌ను ప‌ట్టించుకోని ఫ్రాంచైజీలు..

ఇంకా అరంగ్రేటం చేయ‌ని అర్ష్‌దీప్‌..
ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో అర్ష్ దీప్ సింగ్ భార‌త కీల‌క బౌల‌ర్‌గా ఉన్నాడు. అయితే.. అత‌డు సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం కోసం వేచి చూస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఈ ఎడ‌మ చేతి వాటం పేస‌ర్‌ను ఆడిస్తార‌ని అంతా భావించారు. అయితే.. కోచ్ గంభీర్‌తో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌ను ఆడించింది. వీరిలో ప్ర‌సిద్ధ్ కృష్ణ మిన‌హా మిగిలిన వారు రాణించారు. సిరాజ్ 13 వికెట్ల‌తో ఈ సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా ఉన్నాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా 12 వికెట్లు, ఆకాశ్ దీప్ 11 వికెట్ల‌తో ఉన్నాడు.