KSCA T20 Auction : పాపం రాహుల్ ద్రవిడ్.. పెద్ద కొడుకు సమిత్‌ను పట్టించుకోని ఫ్రాంచైజీలు..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద షాక్ తగిలింది.

Rahul Dravid Son Samit Goes Unsold In Maharaja Trophy KSCA T20 Auction
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా జరిగిన మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ-2025 వేలంలో ఆయన కుమారుడు సమిత్ ద్రవిడ్ ను ఎవ్వరూ కోనుగోలు చేయలేదు.
ఈ వేలంలో మైసూర్ వారియర్స్, హుబ్లి టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, గుల్బర్గా మిస్టిక్స్ లతో కలిపి మొత్తం ఆరు ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ పంట పడింది. అతడిని హుబ్లి టైగర్స్ రికార్డు స్థాయిలో రూ.13.20 లక్షలకు దక్కించుకుంది. అభినవ్ మనోహర్‌ను సైతం రూ. 12.20 లక్షలకు హుబ్లి టైగర్స్, మనీష్ పాండేను రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ సొంతం చేసుకున్నాయి.
అయితే.. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌కు ఈ వేలంలో నిరాశే ఎదురైంది. రూ.50 వేల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడి కోసం ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కాగా.. సమిత్ గతేడాది ఈ టోర్నీలో పాల్గొన్నాడు.
మైసూరు వారియర్స్ కు ప్రాతినిథ్యం వహించారు. అయితే.. ఆ సీజన్‌లో అంచనాలను అందుకోవడంలో అతడు విఫలం అయ్యాడు. గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సమిత్.. 11.71 సగటుతో 82 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ సీజన్‌లో అతడి పై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
BAN vs SL : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. శ్రీలంక గడ్డ పై తొలి టీ20 సిరీస్ విజయం..
కేఎస్‌సీఏ టీ20 టోర్నీ-2025 టోర్నీ ఆగస్టు 11 నుంచి 27 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.