IND-W vs ENG-W : మరీ ఇంత బద్దకం అయితే ఎలా హర్లీన్ డియోల్.. బ్యాట్ కింద పెట్టాలని తెలియదా? ఇప్పుడు చూడు ఏమైందో..
ఇంగ్లాండ్ పర్యటనలో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది.

IND-W vs ENG-W 1st ODI Harleen Deol Embarassing Run Out
ఇంగ్లాండ్ పర్యటనలో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా అదే ఊపులో వన్డే సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ (83; 92 బంతుల్లో 9 ఫోర్లు), అలైస్ రిచర్డ్స్ (53; 73 బంతుల్లో 2 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. తెలుగమ్మాయి శ్రీచరణి ఒక వికెట్ సాధించింది.
BAN vs SL : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. శ్రీలంక గడ్డ పై తొలి టీ20 సిరీస్ విజయం..
అనంతరం లక్ష్యాన్ని భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో దీప్తి శర్మ (62 నాటౌట్; 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (48 54 బంతుల్లో 5 ఫోర్లు), ప్రతీక రావల్ (36 51 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు.
హర్లీన్ డియోల్ రనౌట్..
ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ హర్లీన్ డియోల్ కాస్త ఊదాసీనంగా వ్యవహరించడంతో రనౌట్ అయింది. భారత ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని మిడాన్ దిశగా హర్లీన్ షాట్ ఆడింది. సింగిల్ కు పరిగెత్తింది. బంతిని అందుకున్న ఫీలర్డ్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు వికెట్లకు త్రో చేశారు. కాగా.. ఫీల్డర్ విసిరిన బంతిని వికెట్లను తాకింది. అయితే.. అప్పటికే హర్లీన్ డియోల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు చేరుకుంది.
Foot and bat in the air. 🤯
– One of the most bizzare run outs for India. pic.twitter.com/zAFOnEzhmQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2025
ఇంగ్లాండ్ ఆటగాళ్లు రనౌట్ కోసం అప్పీల్ చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయం కోరారు. రిప్లేలో బంతి వికెట్లను తాకినప్పుడు హర్లీన్ బ్యాట్ గాల్లో ఉంది. ఆమె కాలు కూడా క్రీజులో పెట్టలేదు. దీంతో ఆమె రనౌట్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హర్లీన్ బద్దకంతో కారణంగానే రనౌట్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో హర్లీన్.. 44 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 27 పరుగులు చేసింది.