BAN vs SL : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. శ్రీలంక గడ్డ పై తొలి టీ20 సిరీస్ విజయం..
సొంతగడ్డ పై తిరుగులేని శ్రీలంకకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది.

Bangladesh won the t20 series against Srilanka
సొంతగడ్డ పై తిరుగులేని శ్రీలంకకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. బుధవారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. శ్రీలంక గడ్డ పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు కావడం విశేషం.
కెప్టెన్‌గా లిటన్ దాస్‌కు విదేశాల్లో ఇది రెండో టీ20 సిరీస్ విజయం కావడం గమనార్హం. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనత సాధించాడు. విదేశాల్లో రెండు టీ20 సిరీస్ విజయాలను అందుకున్న తొలి బంగ్లాదేశ్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. లిటన్ సారథ్యంలో గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది.
ఇక బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు సాధించింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక (39 బంతుల్లో 46 పరుగులు), దాసున్ శనక (25 బంతుల్లో 35 పరుగులు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ నాలుగు వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్, షారిఫుల్ ఇస్లాం, షమీమ్ హుస్సేన్ లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. తంజిద్ హసన్ తమీమ్ (73 నాటౌట్; 47 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. కెప్టెన్ లిటన్ దాస్ (32), తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 27 నాటౌట్) రాణాంచారు. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలా ఓ వికెట్ తీశారు.