Andre Russell : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ సంచలన నిర్ణయం.. విండీస్ తరుపున ఇంకో రెండు మ్యాచ్‌లే ఆడతా..
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

West Indies all rounder Andre Russell Announces Retirement From International Cricket
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించాడు. జూలై 20, 22 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు రసెల్ స్వస్థలమైన జమైకాలోని సబీనా పార్క్‌లో జరుగనున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో రసెల్‌కు కూడా చోటు దక్కింది.
2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు రసెల్. 37 ఏళ్ల ఈ ఆటగాడు విండీస్ తరుపున ఓ టెస్టు, 56 వన్డేలు, 84 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన ఒక్క టెస్టు మ్యాచ్‌లో రెండు పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. వన్డేల్లో 1034 పరుగుల చేయడంతో పాటు 70 వికెట్లు తీశాడు. టీ20ల్లో 1078 పరుగులు చేయడంతో పాటు 61 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ జట్టు 2012, 2016లో టీ20 ప్రపంచకప్‌లు సాధించగా.. ఈ రెండు టోర్నీల్లో రసెల్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.
IND vs ENG: నాల్గో టెస్టులో భారత్ గెలవాలంటే.. తుది జట్టులో ఈ నాలుగు మార్పులు చేయాల్సిందేనా..
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా కూడా ప్రపంచ వ్యాప్తంగా వివిధ టీ20 లీగుల్లో ఆడతానని రసెల్ తెలిపాడు.
షై హోప్ నాయకత్వంలో విండీస్ జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. విండీస్ జట్టులో హెట్మైర్, హోల్డర్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.
ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియాపై విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు ఐసీసీ భారీ షాక్..
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ఇదే..
షై హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్.