IND vs ENG: నాల్గో టెస్టులో భారత్ గెలవాలంటే.. తుది జట్టులో ఈ నాలుగు మార్పులు చేయాల్సిందేనా..
నాల్గో టెస్టులో భారత జట్టు ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే భారత జట్టు మాంచెస్టర్ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి. అలా జరగాలంటే భారత తుది జట్టులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ..

IND vs ENG
IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈనెల 23వ తేదీ నుంచి మాంచెస్టర్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా.. తొలి, మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఒక్క బ్యాటర్ అతనికి అండగా నిలిచినా భారత్ విజయం సాధించి ఉండేది.
నాల్గో టెస్టులో భారత జట్టు ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే భారత జట్టు మాంచెస్టర్ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి. అలా జరగాలంటే భారత తుది జట్టులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా నాలుగు విషయాల్లో భారత జట్టులో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
నాల్గో టెస్టులో టీమిండియా సరైన తుది జట్టుతో బరిలోకి దిగాలి. ముఖ్యంగా కరుణ్ నాయర్ వైఫల్యం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. అతను మూడు టెస్టుల్లో 0, 20, 31, 20, 40, 14 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. నాల్గో టెస్టుకు కరుణ్ నాయర్ ను తప్పించే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో సుదర్శన్ లేదా అభిమాన్యు ఈశ్వరన్ తుది జట్టులోకి రావచ్చు.
మరోవైపు.. వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం భారత జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, మ్యాచ్ ప్రారంభం నాటికి అతను రెడీ అవుతాడని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. ఒకవేళ రిషబ్ పంత్ బరిలోకి దిగకుంటే మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తుది జట్టులో చేరే అవకాశం ఉంది.
మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 53 పరుగులు సమర్పించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 31, రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎక్స్‌ట్రాలను నియంత్రించి ఉంటే భారత విజయం సాధించే అవకాశం ఉండేది.