చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో 900 పాయింట్ల మార్కును దాటిన ఏకైక బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నమోదు..

విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మూడు ఫార్మాట్లలో 900 పాయింట్ల మార్కును దాటిన ఏకైక బ్యాటర్‌గా..

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో 900 పాయింట్ల మార్కును దాటిన ఏకైక బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నమోదు..

Virat Kohli

Updated On : July 17, 2025 / 8:02 AM IST

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం జట్టు ప్రకటనకు కొన్నిరోజుల ముందు కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందే.. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తరువాత టీ20 ఫార్మాట్‌కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం టీమిండియా తరపున వన్డే జట్టులో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ టీమిండియా జట్టులో చేరే అవకాశం ఉంది. అయితే, రెండు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించాడు.

Also Read: ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియాపై విజ‌యం సాధించిన‌ ఇంగ్లాండ్‌కు ఐసీసీ భారీ షాక్‌..

తాజాగా ఆల్‌టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రేటింగ్ పాయింట్స్‌ ఐసీసీ అప్‌డేట్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ గతంలో అత్యధిక టీ20 రేటింగ్ పాయిట్లు 897. తాజాగా.. జూలై 16న (బుధవారం) దానిని 909పాయింట్లకు సవరించారు. టెస్టుల్లో కోహ్లీ అత్యధిక రేటింగ్ పాయింట్లు 937. అదేవిధంగా వన్డేల్లో 911. దీంతో మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్ పాయిట్లను అధిగమించిన తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.


ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక ర్యాంకింగ్స్ సాధించిన ఆటగాళ్లు ఇవే
♦ 919 – డేవిడ్ మలన్
♦ 912 – సూర్యకుమార్ యాదవ్
♦ 909 – విరాట్ కోహ్లీ
♦ 904 – ఆరోన్ ఫించ్
♦ 900 – బాబర్ ఆజం
♦ 894 – డేవిడ్ వార్నర్

విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 617 ఇన్నింగ్స్ లలో 52.27 సగటుతో 27,599 పరుగులు చేశాడు. ఇందులో 82 సెంచరీలు, 143 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ 2017, 2018లో ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీ20 ప్రపంచకప్ కూడా గెలిచాడు. డబ్ల్యూటీసీ టైటిల్ ఒక్కటే అతని కెరీర్ కు లోటుగా మిగిలిపోయింది. రెండు సార్లు ఫైనల్ ఆడినా టైటిల్ దక్కలేదు.