ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియాపై విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు ఐసీసీ భారీ షాక్..
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

England Fined and Penalised WTC Points for Slow Over Rate in 3rd Test against India
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇదే క్రమంలో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్న ఇంగ్లాండ్‌కు తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్లను తగ్గించడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత పెట్టింది.
లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేసింది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 10 శాతం కోత విధించింది. అంతేకాదండోయ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్‌లో ఆ జట్టుకు రెండు పాయింట్ల కోత విధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ పాయింట్ల సంఖ్య 24 నుంచి 22కి పడిపోయాయి.
Sourav Ganguly : లార్డ్స్‌లో టీమ్ఇండియా ఓటమిపై గంగూలీ కామెంట్స్..
🚨 ENGLAND PLAYERS FINED. 🚨
– England have been fined 10% of their match fees and docked 2 WTC points for maintaining slow overrate at Lord’s. pic.twitter.com/f5BP9fbL4V
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2025
ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత సమయాని కన్నా రెండు ఓవర్లను తక్కువగా వేసింది. ఐసీసీ నిబంధన ప్రకారం ఒక్క ఓవర్‌కు తక్కువగా వేస్తే 5 శాతం జరిమానా పడుతుంది. ఈ లెక్కన రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో 10 శాతం ఫైన్ పడింది. చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు శిక్షను ఆ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ అంగీకరించడంతో దీనిపై ఇక ఎలాంటి విచారణ ఉండదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ పెనాల్టీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ స్టాండింగ్స్‌లో ఇంగ్లాండ్ స్థానాన్ని ప్రభావితం చేసింది. శ్రీలంక పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లాండ్ మూడో స్థానానికి పడిపోయింది.
Shubman Gill : చివరి బ్యాటర్ ఔట్ అయినప్పుడు ఏమనిపించింది.. గిల్‌కు బ్రిటన్ రాజు ప్రశ్న..
ఇదిలా ఉంటే.. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా, ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.