IPL 2020: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకున్న Dream11

ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫాం డ్రీమ్ 11 ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్ గా నిలిచింది. చైనా మొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్ VIVO స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ఆ స్థానం భర్తీ చేసే వాళ్ల కోసం వెదికింది. డ్రీమ్ 11 రూ.222 కోట్లను వేలంలో గెలుచుకుంది. ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్లు మరో స్పాన్సర్ ను దొరికేలా చేశాయి. దీని కోసం బీసీసీఐ ఆగష్టు 10 నుంచి ఆహ్వానం రెడీ చేసింది. టర్నోవర్ రూ.300 కోట్లు ఉంటేనే బిడ్ కు రావాలని బీసీసీఐ షరతులు పెట్టింది.



ఈ రేసులో Byju’s, Unacademy, టాటా గ్రూప్ లు కూడా పోటీ చేశాయి. డ్రీమ్ 11 రూ.222కోట్లు, బిజూస్ రూ.201 కోట్లు, అనాకడమీ రూ.170 కోట్లకు వేలం వేశాయి. BCCI ఐదేళ్లుగా సంవత్సరానికి రూ.440కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది VIVO. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబరు 10 వరకూ మూడు సిటీల్లో జరగనుంది. షార్జా, అబు దాబి, దుబాయ్ లలో ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది.



ఇండియా, చైనాల మధ్య 45రోజులుగా జరిగిన ఘర్షణ కారణంగా ఐపీఎల్ 2020 నుంచి VIVO టైటిల్ స్పాన్సర్ షిప్ డీల్ ను రద్దు చేసుకుంది. డ్రీమ్ 11 అంతకుముందే బీసీసీఐతో అసోసియేట్ గానే ఉంది. డ్రీమ్ స్పోర్ట్స్ కు 8కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.