Dunith Wellalage : ఇలాంటి బాధ ఏ ఆట‌గాడికీ రాకూడ‌దు.. మ్యాచ్ గెలిచామ‌నే ఆనందంలో ఉండ‌గానే.. కోచ్ వ‌చ్చి షాకింగ్ విషయం..

శ్రీలంక స్టార్ స్పిన్న‌ర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Dunith Wellalage learns of fathers death moments after win vs Afghanistan

Dunith Wellalage : ఆసియాక‌ప్ 2025లో శ్రీలంక జ‌ట్టు సూప‌ర్ 4కి అర్హ‌త సాధించింది. గురువారం అఫ్గానిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. అయితే.. ఆ జ‌ట్టు స్టార్ స్పిన్న‌ర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) త‌దుప‌రి మ్యాచ్‌ల్లో ఆడ‌డం సందేహంగా మారింది. అత‌డి తండ్రి మ‌ర‌ణించాడు.

అఫ్గానిస్తాన్‌తో ఆడుతున్న‌ప్పుడే అత‌డి తండ్రి సురంగ వెల్లలాగే మృతి చెందాడు. అయితే.. ఈ విష‌యాన్ని దునిత్ కు తెలియ‌నివ్వ‌లేదు. మ్యాచ్ ముగిసిన త‌రువాత‌నే అత‌డికి ఈ విష‌యం నుంచి లంక హెడ్‌కోచ్ స‌న‌త్ జ‌య‌సూర్య‌, టీమ్ మేనేజ‌ర్‌లు చెప్పారు. దీంతో అత‌డు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

Mohammad Nabi : న‌బీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌.. వ‌రుస‌గా 5 బంతుల్లో 5 సిక్స‌ర్లు.. తృటిలో యువీ రికార్డు మిస్‌..వీడియో

ఈ విషయం గురించి శ్రీలంక మాజీ క్రికెటర్‌ రసెల్‌ ఆర్నాల్డ్ మాట్లాడుతూ.. అఫ్గాన్‌తో మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడే దునిత్ తండ్రి మ‌ర‌ణించారు. ఆయ‌న కూడా ఒక‌ప్పుడు క్రికెట్ ఆడేవారు. ఆయ‌న మా పాఠ‌శాల టీమ్ కెప్టెన్‌గా ఉండేవార‌ని చెప్పుకొచ్చాడు. ఆయ‌న ఇక లేరు అని తెలిసిన వెంట‌నే నా మ‌న‌సు ఎంతో బాధ‌తో నిండిపోయింది. మ్యాచ్ ముగిసిన త‌రువాత‌నే ఈ విష‌యాన్ని దునిత్‌కు చెప్పాము. అత‌డి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాం. అందుక‌నే మ్యాచ్‌లో గెలిచిన‌ప్ప‌టికి కూడా ఆట‌గాళ్లు సెల‌బ్రేట్ చేసుకోలేదు అని అన్నాడు.

మ్యాచ్‌లో విఫ‌ల‌మైన దునిత్..
అయితే.. ఈ మ్యాచ్‌లో దునిత్ విఫ‌లం అయ్యాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 49 పరుగులు ఇచ్చి ఇబ్రహీం జాద్రాన్ వికెట్ తీసుకున్నాడు. అత‌డి ఆఖ‌రి ఓవ‌ర్‌లో అఫ్గాన్ ఆట‌గాడు న‌బీ వ‌రుస‌గా ఐదు సిక్స‌ర్లు బాదాడు.

Asia Cup 2025 : ఆసియాక‌ప్‌లో సూపర్-4కు చేరిన 4 జట్లు.. భార‌త్ ఆడే మ్యాచ్‌ల వివ‌రాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..

2022లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన దునిత్‌.. ఒక టెస్టు, 31 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వ‌న్డేల్లో 39, టీ20ల్లో ఏడు వికెట్లు సాధించాడు. ఆడిన ఒక్క టెస్టులో వికెట్ తీయ‌లేదు. వ‌న్డేల్లో 386 ప‌రుగులు సాధించాడు.