Asia Cup 2025 : ఆసియాకప్‌లో సూపర్-4కు చేరిన 4 జట్లు.. భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆసియాకప్2025 లో (Asia Cup 2025) సూపర్4కి చేరే నాలుగు జట్లు ఏవో తెలిసి పోయాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ అడుగుపెట్టగా..

Asia Cup 2025 Super 4 schedule here full details
Asia Cup 2025 : ఆసియాకప్ 2025లో సూపర్-4కి చేరే నాలుగు జట్లు ఏవో తెలిసిపోయాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్ లు ఇప్పటికే సూపర్-4కి అర్హత సాధించాయి. గురువారం జరిగిన శ్రీలంక, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ద్వారా మరో రెండు జట్లు ఖరారు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన శ్రీలంక.. వరుసగా మూడు విజయాలతో గ్రూప్-బి టాపర్‌గా సూపర్ 4లో అడుగుపెట్టింది. అఫ్గాన్ రేసు నుంచి నిష్ర్కమించగా, బంగ్లాదేశ్ సైతం తదుపరి దశకు చేరుకుంది.
8 జట్లతో ఆసియాకప్ 2025 టోర్నీ (Asia Cup 2025) మొదలైంది. సూపర్-4కి నాలుగు జట్లు.. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించింది. ఒమన్, యూఏఈ, హాంగ్‌కాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్కమించాయి.
Hardik Pandya : ఒమన్‌తో మ్యాచ్.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న భారీ రికార్డు..
సూపర్ 4 షెడ్యూల్ ఇదే..
భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4లో తలపడనున్నాయి. ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడనుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. టీమ్ఇండియా 21న పాక్‌తో, 24న బంగ్లాదేశ్‌తో, 26న శ్రీలంకతో ఆడనుంది.
* సెప్టెంబర్ 20న – శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్
* సెప్టెంబర్ 21న – భారత్ వర్సెస్ పాకిస్తాన్
* సెప్టెంబర్ 23న – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక
* సెప్టెంబర్ 24న – భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
* సెప్టెంబర్ 25న – పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్
* సెప్టెంబర్ 26న – భారత్ వర్సెస్ శ్రీలంక
ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.