Sai Sudharsan : అరె ఏంట్రా ఇదీ.. అరంగ్రేటం మ్యాచ్‌లో సాయి సుదర్శన్ డకౌట్..
ఎన్నో అంచనాలతో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన సాయి సుదర్శన్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు.

ENG vs IND 1st test sai sudharsan duck out on test debut
ఎన్నో అంచనాలతో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన సాయి సుదర్శన్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. నాలుగు బంతులు మాత్రమే ఆడి పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అండర్సన్-తెందుల్కర్ ట్రోఫీలో భాగంగా హెడింగ్లీ వేదిగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (42), శుభ్‌మన్ గిల్ (0) లు క్రీజులో ఉన్నాయి.
Mohammed Siraj : సిరాజ్ కొత్త బిజినెస్.. విరాట్ రూట్ లోనే..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ లు చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్.. బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ అందుకోవడంతో తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ దశలో ఎంతో కీలకమైన మూడో స్థానంలో బరిలోకి దిగిన సాయి సుదర్శన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడతారని భావించగా.. ఒత్తిడికి గురైయ్యాడు. తొలి బంతి నుంచే తడబడ్డాడు. చివరికి బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో జేమ్సీ స్మిత్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ఈ యువ ఆటగాడు.. టీమ్ఇండియా తరుపున తొలి టెస్టు మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయాడు.
ENG vs IND : అరెరె అచ్చం గంగూలీ, ద్రవిడ్‌లాగానే సాయి సుదర్శన్.. ప్రత్యర్థి ఒకరే.. కోహ్లీతోనూ ఓ పోలిక..
Lunch 🍱 on the opening day of the 1st Test.#TeamIndia move to 92/2, Yashasvi Jaiswal unbeaten on 42*
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/21wp9iQQKb
— BCCI (@BCCI) June 20, 2025