Mohammed Siraj : సిరాజ్ కొత్త బిజినెస్.. విరాట్ రూట్ లోనే..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త బిజినెస్‌ను ప్రారంభించాడు.

mohammed siraj enter into restaurant business
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త బిజినెస్‌ను ప్రారంభించాడు. ఈ విషయాన్నిస్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాదిరిగానే సిరాజ్ సైతం రెస్టారెంట్ బిజినెస్ నే ప్రారంభించాడు.
View this post on Instagram
జోహార్ఫా…ప్రీమియం రెస్టారెంట్
జొహార్ఫా పేరుతో ఒక కొత్త ప్రీమియం రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు తెలిపాడు. ఇక రెస్టారెంట్‌లో పర్షియన్, అరేబియన్, మొఘలాయి, చైనీస్ వంటకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సిరాజ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లకే అందుబాటులో ఉంటాడు కాబట్టి సిరాజ్ పై అదనపు బాధ్యత పడనుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో సిరాజ్ రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.