ENG vs IND 1st test : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 ఆలౌట్
హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది.

ENG vs IND 1st test
హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (147; 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134; 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు.
కేఎల్ రాహుల్ (42) రాణించగా అరంగ్రేట ఆటగాడు సాయి సుదర్శన్, ఎనిమిదేళ్ల తరువాత టీమ్ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్‌లు డకౌట్లు అయ్యారు. ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్ (1), రవీండ్ర జడేజా (11) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.
112 పరుగులు.. 7 వికెట్లు..
ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించిన భారత్ మరో 112 పరుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు గిల్(127), పంత్(65) ఆట మొదటి గంటలో ఇంగ్లాండ్ బౌలర్లుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా పంత్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్సర్‌తో టెస్టుల్లో ఏడో సెంచరీని నమోదు చేశాడు.
Innings Break! #TeamIndia posted 4⃣7⃣1⃣ on the board! 💪
1⃣4⃣7⃣ for captain Shubman Gill
1⃣3⃣4⃣ for vice-captain Rishabh Pant
1⃣0⃣1⃣ for Yashasvi Jaiswal
4⃣2⃣ for KL RahulOver to our bowlers now! 👍
Updates ▶️ https://t.co/CuzAEnAMIW #ENGvIND | @ShubmanGill |… pic.twitter.com/mRsXBvzXKx
— BCCI (@BCCI) June 21, 2025
ఇక 150 పరుగుల మైలురాయికి దగ్గరగా వచ్చిన గిల్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. దీంతో 209 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్ది సేపటికే ఎనిమిదేళ్ల తరువాత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు మాత్రమే ఆడిన అతడు బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో ఓలీపోప్ పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Rishabh Pant : సిక్సర్‌తో రిషబ్ పంత్ సెంచరీ.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్..
సెంచరీ తరువాత కూడా దూకుడుగా ఆడిన పంత్ జట్టు స్కోరు 453 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత టీమ్ఇండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ ఆలౌట్ అయ్యేందుకు పెద్దగా సమయం పట్టలేదు.