ENG vs IND : య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ.. అరుదైన జాబితాలో చోటు

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొట్టాడు.

ENG vs IND : య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ.. అరుదైన జాబితాలో చోటు

Updated On : June 20, 2025 / 8:45 PM IST

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొట్టాడు. హెడింగ్లీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో శ‌త‌కంతో దుమ్ములేపాడు. కేవ‌లం 144 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. ఇందులో 16 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. టెస్టుల్లో య‌శ‌స్వి జైస్వాల్ కు ఇది ఐదో సెంచ‌రీ.

Sai Sudharsan : అరె ఏంట్రా ఇదీ.. అరంగ్రేటం మ్యాచ్‌లో సాయి సుద‌ర్శ‌న్ డ‌కౌట్‌..

ఇక జైశ్వాల్ త‌న కెరీర్‌లో ఇంగ్లాండ్‌ గ‌డ్డ‌పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచ‌రీ సాధించ‌డం విశేషం.  త‌ద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భార‌త ఆట‌గాడిగా జైశ్వాల్ నిలిచాడు.

ఇంగ్లాండ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

ముర‌ళీ విజ‌య్ – 146 ర‌న్స్ – 2014లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో
విజయ్ మంజ్రేకర్ – 133 ర‌న్స్ -1952లో హెడింగ్లీలో
సౌర‌వ్ గంగూలీ – 131 ర‌న్స్ – 1996లో లార్డ్స్‌లో
సందీప్ పాటిల్ -129 * ర‌న్స్ – 1982 ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో
య‌శ‌స్వి జైస్వాల్ – 101 ర‌న్స్ – 2025 హెడింగ్లీలో