Mohammed Siraj : జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు.. కానీ మనం మాత్రం.. సిరాజ్ కామెంట్స్..
రోడ్డు ప్రమాదంలో డియోగో జోటా చనిపోయాడని గత మ్యాచ్ సమయంలో తెలిసిందని సిరాజ్ తెలిపాడు.

ENG vs IND 3rd Test Mohammed Siraj speaks about his Diogo jota tribut
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఈ రెండు వికెట్లను సిరాజ్ పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటాకు అంతకితం ఇస్తున్నట్లుగా మైదానంలో సంజ్ఞ చేశాడు. ఇందుకు గల కారణాన్ని బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో సిరాజ్ వెల్లడించాడు.
రోడ్డు ప్రమాదంలో డియోగో జోటా చనిపోయాడని గత మ్యాచ్ సమయంలో తెలిసిందని సిరాజ్ తెలిపాడు. తాను పోర్చుగల్ అభిమానినని, ఎందుకంటే క్రిసియానో రొనాల్డో ఆ జట్టు తరుపున ఆడుతుండడమే కారణం అని చెప్పాడు. డియోగో మరణవార్త విని భావోద్వేగానికి లోనైనట్లుగా పేర్కొన్నాడు.
Shubman Gill : ఐసీసీ జరిమానా నుంచి తెలివిగా తప్పించుకున్న శుభ్‌మన్ గిల్.. ఎలాగో తెలుసా ?
A heartfelt gesture!
Mohammed Siraj pays his tribute to the late Diogo Jota. pic.twitter.com/B59kmWG3TO
— BCCI (@BCCI) July 12, 2025
‘జీవితం అంచనాలకు అందదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కానీ మనం చాలా వాటి కోసం ఫైట్ చేస్తుంటాము. జీవితానికి గ్యారెంటీ ఉండదు. నేను రోడ్డు ప్రమాదం గురించి విని షాక్ అయ్యా. లార్డ్స్‌లో వికెట్లు తీసిన తరువాత అలా అంకితం ఇచ్చా.’ అని సిరాజ్ అన్నాడు.
జూలై 3న స్పెయిన్‌లో జరిగిన కారు ప్రమాదంలో డియోగో జోటా మరణించాడు. ఈ ప్రమాదంలో అతడి సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.