Rishabh Pant : గాయపడితేనేం.. రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్న రిషబ్ పంత్.. గురువుగారి రికార్డు బ్రేక్..
టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.

ENG vs IND 3rd Test Pant surpasses MS Dhoni in another record in England soil
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లార్డ్స్ టెస్టు మొదటి రోజు ఆటలో గాయపడ్డాడు. అతడి ఎడమచూపుడు వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మైదానం నుంచి నిష్ర్కమించగా, అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. ఇక రెండో రోజు ఆటలో భారత ఫీల్డింగ్ సందర్భంగా పంత్ మైదానంలోకి రాలేదు. దీంతో పంత్ కనీసం బ్యాటింగ్‌కు అయినా వస్తాడా లేదా అనే ఉత్కంఠ అందరిలో ఉంది.
అయితే.. పంత్ క్రీజులోకి అడుగుపెట్టడమే కాదు ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 33 బంతులను ఎదుర్కొని 19 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. 2014లో ధోని ఇంగ్లాండ్ పర్యటనలో 349 పరుగులు చేయగా.. తాజాగా పంత్ 361 చేశాడు.
ఇక సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తన పేరిటే ఉన్న రికార్డును పంత్ అధిగమించాడు. 2018 ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ 350 పరుగులు చేశాడు.
సెనా దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు వీరే..
* రిషబ్ పంత్ – 361* పరుగులు (ఇంగ్లాండ్ పై 2025లో)
* రిషబ్ పంత్ – 350 పరుగులు (ఆస్ట్రేలియా పై 2018లో)
* ఎంఎస్ ధోని – 349 పరుగులు (ఇంగ్లాండ్ పై 2014లో)
* రిషబ్ పంత్ – 349 పరుగులు (ఇంగ్లాండ్ పై 2021లో)
* ఫరూఖ్ ఇంజినీర్ – 321 పరుగులు (న్యూజిలాండ్ పై 1968లో)
ENG vs IND : లడ్డూ లాంటి క్యాచ్‌ను మిస్ చేసిన కేఎల్ రాహుల్.. సిరాజ్ రియాక్షన్ వైరల్..
ఇక లార్డ్స్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేసింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (53), రిషభ్ పంత్ (19) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.