Shubman Gill-Virat Kohli : విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శుభ్‌మ‌న్ గిల్‌.. ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై ఏకైక భార‌త కెప్టెన్‌గా..

టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి శుభ్‌మ‌న్ గిల్ బ్యాటింగ్‌లో చెల‌రేగిపోతున్నాడు.

Shubman Gill-Virat Kohli : విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శుభ్‌మ‌న్ గిల్‌.. ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై ఏకైక భార‌త కెప్టెన్‌గా..

ENG vs IND 3rd Test Gill breaks Kohli run scoring record in england

Updated On : July 12, 2025 / 10:53 AM IST

టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి శుభ్‌మ‌న్ గిల్ బ్యాటింగ్‌లో చెల‌రేగిపోతున్నాడు. ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 147 ప‌రుగులు చేసిన గిల్‌.. ఆ త‌రువాత రెండో టెస్టులో ఆకాశమే హ‌ద్దుగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశ‌త‌కం (269) బాదిన అత‌డు రెండో ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ (161) న‌మోదు చేశాడు. ఈ క్ర‌మంలో రెండు టెస్టుల్లోనే 585 ప‌రుగులు సాధించాడు.

భీక‌ర ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్‌.. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడ‌తాడ‌ని అంతా భావించారు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో అత‌డు త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 44 బంతుల‌ను ఎదుర్కొన్న గిల్ 2 ఫోర్ల సాయంతో 16 ప‌రుగులు చేశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జేమీ స్మిత్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ENG vs IND : ల‌డ్డూ లాంటి క్యాచ్‌ను మిస్ చేసిన కేఎల్ రాహుల్‌.. సిరాజ్ రియాక్ష‌న్ వైర‌ల్‌..

అయిన‌ప్ప‌టికి గిల్ ఓ రికార్డును అందుకున్నాడు. ఇంగ్లాండ్ గ‌డ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో అత‌డు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ గ‌డ్డ పై 2018లో జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో కోహ్లీ 593 ప‌రుగులు చేయ‌గా.. తాజా సిరీస్‌లో గిల్ 601 ప‌రుగులు సాధించాడు. ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై 600 ప‌రుగులు సాధించిన తొలి భార‌త కెప్టెన్‌గానూ గిల్ రికార్డు సాధించాడు.

ఇంగ్లాండ్ గ‌డ్డ పై ఓ సీరిస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్లు వీరే..

* శుభ్‌మ‌న్ గిల్ – 601* ప‌రుగులు (2025లో)
* విరాట్ కోహ్లీ – 593 ప‌రుగులు (2018లో)
* మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ – 426 ప‌రుగులు (1990లో)
* సౌర‌వ్ గంగూలీ – 351 ప‌రుగులు (2002లో)
* ఎంఎస్ ధోని – 349 ప‌రుగులు (2014లో)

Jasprit Bumrah : ఐదు వికెట్లు తీసినా నో సెల‌బ్రేష‌న్స్‌.. అస‌లు నిజాన్ని చెప్పేసిన బుమ్రా.. ఇలా అయితే టెస్టు కెరీర్ క‌ష్ట‌మే?

ఇక లార్డ్స్ టెస్టు విష‌యానికి వ‌స్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 ప‌రుగులు చేసింది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్‌ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్ల న‌ష్టానికి 145 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (53), రిష‌భ్ పంత్ (19) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భార‌త్ ఇంకా 242 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.